వెల్దండ, జూన్ 18: ఆపదలో ఉన్నవారికి అండగా నిలుస్తానని కుప్పగండ్ల మాజీ సర్పంచ్, బీఆర్ఎస్ నేత జిల్లా నాయకుడు మొక్తాల శేఖర్ అన్నారు. నాగర్కర్నూల్ జిల్లా వెల్దండ మండలం కుప్పగండ్ల గ్రామంలో బుధవారం రాత్రి అనారోగ్యంతో మరణించిన దుబ్బ పెద్దమ్మ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. వారికి రూ.3 వేలు ఆర్థిక సహాయం, 25 కిలోల బియ్యం అందించారు. వారి కుటుంబానికి అన్నివేళలా అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ఆయన వెంట బీఆర్ఎస్ నాయకులు గోరేటి దశరథం, దుబ్బ దేవయ్య, పారేశా, ఎండి అహ్మద్, గోరేటి బుజ్జయ్య, దుబ్బ వెంకటయ్య, ఊర రాములు ఆయిళ్ల జంగయ్య, మేదర్ రాములు, జల్లెల శీను, మున్నూరు సత్యనారాయణ, పూర రమేష్, మొక్తాల వెంకటయ్య, తాటికొండ యాదయ్య, బీఆర్ఎస్ కార్యకర్తలు ఉన్నారు.