బిజినేపల్లి,జూలై 19 : సీపీఐ మహాసభలను విజయవంతం చేయాలని సీపీఐ బిజినేపల్లి మండల సహాయ కార్యదర్శులు భూపేష్,మధు గౌడ్ అన్నారు. సీపీఐ నాగర్ కర్నూలు జిల్లా మూడో మహాసభ సందర్భంగా శనివారం మండలంలోని లట్టుపల్లి గ్రామంలో కరపత్రం విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజా సమస్యలపై కమ్యూనిస్టు పార్టీలే పోరాడుతాయన్నారు.
సమస్యలపై పార్టీ తరఫున ఉద్యమిస్తామని పేర్కొన్నారు. సీపీఐ జిల్లా మూడో మహాసభను కల్వకుర్తి పట్టణంలో ఆగస్టు 1,2 తేదీలలో నిర్వహిస్తామని ఈ మహాసభను జయప్రదం చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో సీపీఐ నాయకులు మంగంపేట శీను, బుగ్గ నాగన్న, ఉషన్న, చంద్రయ్య, రాములు తదితరులు పాల్గొన్నారు.