తిమ్మాజిపేట : మండల పరిధిలోని అప్పాజీపల్లి గ్రామ కాంగ్రెస్ పార్టీ నూతన అధ్యక్షుడిగా అంజన్ రెడ్డిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సీనియర్ లీడర్స్ అయిన చిలుక వివేక్ రెడ్డి, చిలుక ఎల్లారెడ్డి, చిలుక భాస్కర్ రెడ్డి, చంద్రమౌళి గౌడ్, జల్లి వెంకటయ్య, అప్పల మల్లేష్ పలువురి అధ్యక్షతన నూతన కమిటీ ఎన్నుకున్నారు.
ఉపాధ్యక్షుడిగా పోతురపల్లి తిరుపతయ్య కోశాధికారిగా అప్పల మల్లేష్, కేశంపేట శీనులను ఎన్నుకున్నారు. వీరితోపాటు ఏడుగురు సభ్యులను తీసుకున్నారు. అదేవిధంగా యూత్ కాంగ్రెస్ అప్పాజీపల్లి అధ్యక్షుడిగా జల్లి శ్రీకాంత్, ఉపాధ్యక్షుడిగా మొగిలి చందు, కోశాధికారిగా కేశంపేట శేఖర్ ను ఎన్నుకున్నారు.