కొల్లాపూర్ : మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో కో–ఆప్షన్ సభ్యులలో ఒకరిని ట్రాన్స్‌జెండర్స్‌కు అవకాశాలు కల్పించాలని నాగర్ కర్నూలు జిల్లా ట్రాన్స్ జెండర్స్ సొసైటీ సభ్యులు మంగళవారం మంత్రి జూపల్లి కృష్ణారావుకు వినతిపత్రం అందజేశారు. ట్రాన్స్ జెండర్స్‌కు సమాజంలో సముచిత ప్రాతినిధ్యం కల్పించాలని, డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల మంజూరు చేయాలన్నారు.
ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలని అర్హులైన ట్రాన్స్ జెండర్స్‌కు రేషన్ కార్డులు ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో ట్రాన్స్ జెండర్స్ అసోసియేషన్ నాయకులు శివాని నాయక్, జానకి నాయక్, దీక్షిత్ పాల్గొన్నారు.