కోడేరు, జూలై 4: సీఎం సహాయనిధి పథకం పేదప్రజలకు వరంగా మారిందని కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి పేర్కొన్నారు. మండలంలోని నర్సాయపల్లి గ్రామానికి చెందిన మణెమ్మ అనారోగ్య సమస్యతో హైదరాబాద్‌లోని నిమ్స్ దవాఖానలో చేరగా మెరుగైన వైద్యం కోసం రెండు విడతలుగా రూ.7లక్షల ఎల్వోసీని ఆదివారం బాధితులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ ఆపత్కర సమయంలో కూడా ప్రతి పేద, సామాన్య, మధ్యతరగతి కుటుంబాలకు మెరుగైన వైద్యం అందుతుందంటే అది కేవలం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వల్లనే సాధ్యపడుతుందన్నారు. కిందటి నెలలో మణెమ్మ అనారోగ్యానికి గురికావడంతో కుటంబీకులు నిమ్స్‌లో చేర్పించారు. వైద్య ఖర్చుల నిమిత్తం సీఎం సహాయనిధి నుంచి రూ.3లక్షలు గతనెల 23న మంజూరు చేయించారు. అయినా కూడా మణెమ్మ ఆరోగ్యం మెరుగు పడకపోవడంతో తిరిగి మళ్లీ కుటుంబీకుల అభ్యర్థన మేరకు ఎమ్మెల్యే బీరం ప్రత్యేక చొరవ తీసుకొని రెండోసారి రూ.4లక్షల ఎల్వోసీ మంజూరు చేయించారు. అట్టి ఎల్వోసీని ఆదివారం తన నివాసంలో బాధిత కుటంబీకులకు అందజేశారు. వినతిని మన్నించి సీఎం సహాయనిధి నుంచి రూ.7లక్షలను మంజూరు చేసిన సీఎం కేసీఆర్, చేయించిన ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డికి తమ కుటుంబ సభ్యలం ఎల్లప్పుడూ రుణపడి ఉంటామని కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో నర్సాయపల్లి సర్పంచు కొమ్మ సత్యనారాయణయాదవ్, నాయకులు ఉన్నారు.