మహబూబ్‌నగర్, అక్టోబర్ 8 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : వెనుకబడిన తెలంగాణ అభివృద్ధిపై అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన ప్రసంగం అందరినీ ఆకట్టుకున్నది. ఏడేండ్లుగా రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని కళ్ల కు కట్టినట్లు చెప్పారని ఉమ్మడి జిల్లా వాసులు అభిప్రాయపడుతున్నారు. ఒకప్పు డు వలసలకు నెలవుగా ఉన్న పా లమూరుకే నేడు రివర్స్ మైగ్రేషన్ ప్రారంభమైందంటే.. అందుకు సీఎం కేసీఆర్ జనరంజక పాలనే కారణంగా పేర్కొంటున్నారు. సమైక్య రాష్ట్రంలో కనీసం బతుకమ్మ పండుగకు సెలవు కూడా ఇవ్వని దుస్థితి నుంచి.. నే డు సగర్వంగా జరుపుకొనే స్థాయికి చేరుకోవడం గర్వకారణం. తలాపునే కృష్ణ, తుంగభద్ర నదులు ప్రవహించినా.. సాగు, తా గు నీటికి ఎన్నో కష్టాలు ఎదుర్కొన్న పరిస్థితి నుంచి.. నేడు ప్రాజెక్టుల ద్వారా సాగునీరే కాకుండా మిషన్ భగీరథతో ప్రతి గ్రామానికి స్వచ్ఛమైన తాగునీరు అందించడం మామూలు విషయం కాదని అంటున్నారు. మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో తెలంగాణ ఏర్పాటుకు ముందు సేదతీరేందుకు కేవలం రెండే పార్కులుంటే.. ఇప్పుడు వాటి సంఖ్య 47కు చేరుకున్నది. కేవలం రూ. 200 వచ్చే పింఛన్ నేడు వృద్ధులకు రూ.2,016, దివ్యాంగులకు రూ.3,016 ఇస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుంది. రైతు లు కలలో కూడా ఊహించని నిరంతర నాణ్యమైన ఉచిత వి ద్యుత్, పెట్టుబడికి ఎకరాకు రూ.10 వేలు అందించే రైతుబంధు, కుటుంబానికి ఆసరాగా ఉండే రైతు అనుకోని పరిస్థితుల్లో చనిపోతే రైతుబీమా కింద రూ.5 లక్షల సాయం అందించడం ఒక్క తెలంగాణలోనే సాధ్యం.
మిషన్ కాకతీయతో సుమా రు 2 వేల చెరువులు పునరుద్ధరించి రైతాంగానికి అండగా నిలిచారు. మ త్స్య శాఖ ద్వారా ఉచిత చేపపిల్లలు, మత్స్యకారులకు వివిధ ఉ పాధి అవకాశాలు, గొర్రెల పెంపకందారులకు ఉచితంగా గొర్రె లు, నేతన్నకు చేయూత, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బీసీలకు రుణాలు, అంగన్వాడీల ద్వారా మాతాశిశు సంరక్షణ, కొవిడ్ సమయంలో అర్హులైన వారందరికీ ఉచిత రేషన్ బియ్యం, గ్రామీణాభివృద్ధి శా ఖ ద్వారా మహిళా సంఘాలకు కోట్లాది రూపాయల రుణాలు, కేసీఆర్ కిట్, ఆరోగ్య శ్రీ, కల్యాణలక్ష్మి, షాదీముబారక్, గ్రామ పంచాయతీలు, పట్టణాల్లో ప్రగతి వెల్లివిరిసేలా నిధులు విడుద ల చేసి పచ్చదనం, పారిశుధ్యం పెంపునకు కృషి చేశారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసి సుమారు 8 లక్షల ఎకరాలకు పైగా సాగునీరు అందిస్తున్నారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పనులు పూర్తి చేసి సాగునీరు అందించే ప్ర క్రియ అత్యంత వేగంగా జరుగుతున్నది. ఉమ్మడి జిల్లా వ్యా ప్తంగా ఇప్పటికే 5 వేలకు పైగా డబుల్ బెడ్రూం ఇండ్లు నిర్మించగా.. ఇంకా వేలాది ఇండ్లు నిర్మాణంలో ఉన్నాయి. అయితే, శుక్రవారం అసెంబ్లీ వే దికగా సొంత స్థలాలు ఉన్న వారికి సైతం డ బుల్ బెడ్రూం ఇండ్లు కట్టుకునేందుకు ఆర్థిక సాయం చేస్తామని సీ ఎం ప్రకటించడంపై పా లమూరు వాసులు హ ర్షం వ్యక్తం చేస్తున్నారు. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి కేంద్రంలో, రాష్ట్రం లో అధికారం అనుభవించిన పార్టీలు ప్రజలకు చే సిందేమీ లేదనే విషయాన్ని అసెంబ్లీ వేదికగా సీఎం దు య్యబట్టారు. ఉమ్మడి జిల్లాలో అభివృద్ధిని ప్రతిపక్షాలు తట్టుకోలేకపోతున్నాయి.
హాయిగా బతుకుతున్నాం..
సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలతో మా కుటుంబానికి ఎంతో మేలు జరిగింది. నా కొడుకు పిప్పళ్ల బాలయ్య వ్యవసాయం చేసేవాడు. గతేడాది పత్తిని కేశంపేట మండలం వేముల్‌నర్వ కాటన్‌మిల్ వద్ద అమ్మడానికి వెళ్లగా, రోడ్డు ప్రమాదంలో మరణించాడు. బాలయ్యకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు, భార్య శివలీల ఉన్నారు. బాలయ్య పేరుమీద నాలుగు ఎకరాల భూమి ఉండడంతో రైతుబీమా కింద రూ.5 లక్షలు వచ్చాయి. అలాగే ప్రతి ఏడాది రైతుబంధు డబ్బులు వస్తున్నాయి. నాకు వృద్ధాప్య పింఛన్ వస్తున్నది. మనవరాలు పెండ్లికి కల్యాణలక్ష్మి కింద పైసలొచ్చాయి. పెద్దదిక్కును కోల్పోయినా ప్రభుత్వ పథకాలు ఆదుకున్నాయి. ఎలాంటి ఇబ్బందులు లేకుండా హాయిగా బతుకుతున్నాం. సీఎం కేసీఆర్‌కు ఎప్పుడూ రుణపడి ఉంటాం.
సీఎం కేసీఆర్ దేవుడితో సమానం..
గతేడాది పెండ్లి కాగా కల్యాణలక్ష్మి సాయం అందింది. ఈ నెల ఆరో తేదీన అమరచింత ప్రభుత్వ దవాఖానలో ప్రసవం కాగా, ఆడపిల్ల పుట్టింది. కేసీఆర్ కిట్‌తో పాటు రూ.13 వేలు అందించారు. ప్రైవేట్ దవాఖానకు వెళ్తే దాదాపు రూ.30 వేలు ఖర్చు అయ్యేది. ప్రభుత్వ దవాఖానలో కాన్పు కావడంతో డబ్బులు మిగలడంతోపాటు కేసీఆర్ కిట్ ఇచ్చారు. అందులో తల్లితోపాటు బిడ్డలకు సరిపడా వస్తువులు ఉన్నాయి. అంతేకాకుండా మాకు ఐదెకరాల పొలం ఉండగా ఏడాదికి రెండు కార్లకు కలిపి రూ. 50 వేల రైతుబంధు అందుతున్నది. దీంతో పంట పెట్టుబడికి అప్పుల బాధ తీరింది. అన్ని వర్గాల వారిని ఆదుకుంటున్న సీఎం కేసీఆర్ దేవుడితో సమానం.
సర్కార్ సేవలు మరిచిపోము..
కేసీఆర్ సర్కార్ వచ్చినంక కష్టాలు దూరమయ్యాయి. కరువు కాటకాలతో ఊర్లు ఇడిసిపెట్టి బతుకుదెరువు కోసం దేశాలు పోయెటోళ్లు తిరిగి ఇండ్లకు వస్తున్నరు. కేఎల్ఐ నీళ్లు వచ్చినంక రెండు కార్లు పంటలు పండుతున్నాయి. రైతుబంధుతో పెట్టుబడికి అప్పుల బాధ తప్పింది. నాకు ఐదెకరాల పొలం ఉన్నది. మా చిన్న తమ్ముడు లింగం వ్యవసాయం చేసేవాడు. రెండేండ్ల కిందట వడదెబ్బతో మృతి చెందాడు. ప్రభుత్వం నుంచి రూ.5 లక్షలు రైతుబీమా డబ్బులు వచ్చాయి. నా కూతురు శిరీష గతేడాది ప్రభుత్వ దవాఖానలో ప్రసవమైతే ప్రోత్సాహకంగా రూ.12 వేలతోపాటు కేసీఆర్ కిట్ ఇచ్చారు. మా పెద్ద తమ్ముడు వెంకటయ్య వికలాంగుడు కావడంతో నెలకు రూ.3 వేల పింఛన్ వస్తున్నది. మా అమ్మకు వృద్ధాప్య పింఛన్ రూ.2 వేలు వస్తుంది. మా కుటుంబమంతా సీఎం కేసీఆర్‌కు రుణపడి ఉన్నాం. సాయం చేసిన సర్కార్‌ను ఎన్నటికీ మరిచిపోము.
కేసీఆర్ సార్‌కు రుణపడి ఉంటాం..
ముఖ్యమంత్రి కేసీఆర్ పేదల పాలిట దేవుడు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని సంక్షేమ
పథకాలు తెలంగాణలో ప్రవేశపెట్టి అండగానిలుస్తున్నారు. నాకు మూడున్నర
ఎకరాలు ఉండగా, రైతుబంధు డబ్బులొస్తున్నాయి. కూతురు పెండ్లి చేస్తే కల్యాణలక్ష్మి ద్వారా రూ.1,00,116 వచ్చాయి. నెలనెలా దివ్యాంగుల పింఛన్ రూ.3,016 వస్తున్నాయి. ప్రజల గురించి ఇంత గొప్పగా ఆలోచన చేసే వ్యక్తి ఎవరూ లేరు. నా కుటుంబం సీఎం కేసీఆర్‌కు జీవితాంతం రుణపడి ఉంటది.
– ఆరేళ్ల పర్వతాలు గౌడ్, చారకొండ