‘సమాజం చీత్కరించుకొనే మురికి మనుషుల మధ్య నడిచే అందమైన ప్రేమకథ ‘కాక్రోచ్’. ఓ వేశ్యకి, ఓ కిరాయి హంతకుడికీ మధ్య సాగే స్వచ్ఛమైన స్నేహమే ప్రధాన ఇతివృత్తంగా ఈ సినిమా రూపొందింది’ అంటున్నారు దర్శకడు సునీల్‌కుమార్‌రెడ్డి. అభిలాష్ సుంకర, ప్రేమసన్, నవీన్ ఇందులో కిరాయి హంతకులుగా నటించగా, ‘సొంతవూరు’ చిత్రం ద్వారా ఉత్తమనటి అవార్డు అందుకున్న తీర్థ ముఖ్య పాత్ర పోషించింది. బి.బాపిరాజు నిర్మాత. సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి.
‘ఏ’సర్టిఫికెట్ మంజూరైంది. మార్చిలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ‘కాక్రోచ్ని చంపి ఆనందంతో చప్పట్లు కొడుతూ.. సీతాకోక చిలుకపై కవితలు రాసే ద్వంద్వ మనస్తత్వాలను ప్రశ్నించే కథతో దర్శకుడు సునీల్కమార్రెడ్డి ఈ సినిమాను మలిచారని, సున్నిత మనస్కులు, పిల్లలు ఈ చిత్రానికి దూరంగా ఉండాలని నిర్మాతలు ప్రత్రికాముఖంగా ప్రకటించారు. ఈచిత్రానికి కెమెరా: సంతోష్, సంగీతం: ప్రదీప్‌చంద్ర, నిర్మాణం: శ్రీలక్ష్మీ పిక్చర్స్.