నాగర్‌కర్నూల్, జనవరి 1: ఆంగ్ల నూతన సంవత్సరాది సందర్భంగా అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది నూతన ఉత్తేజంతో విధులు నిర్వర్తించాలని కలెక్టర్ ఉదయ్‌కుమార్ సూచించారు. కలెక్టరేట్లో శనివారం పలువురు అధికారులు కలెక్టర్‌కు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా ప్రజలకు తమవంతు సేవచేస్తూ విధులు నిర్వర్తించాలని అధికారులకు సూచించారు. కొత్త ఏడాదిలో అడుగుపెడుతున్న సందర్భంగా ఆయా శాఖల్లోని అధికారులు కొత్త ఒరవడితో ప్రజలకు సేవలందించాలని చెప్పారు. కాగా కలెక్టర్‌ను కలిసేందుకు వచ్చిన జిల్లా అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది కలెక్టర్‌కు పుష్పగుచ్ఛాలు అందించి నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలిపారు. అదేవిధంగా అదనపు కలెక్టర్ శ్రీనివాస్‌రెడ్డికి నాగర్‌కర్నూల్ ఇన్చార్జి తాసిల్దార్ ఖాజా, పలువురు అధికారులు శుభాకాంక్షలు తెలిపారు.
ఐద్వా క్యాలెండర్ ఆవిష్కరణ
ఐద్వా మహిళాసంఘం క్యాలెండర్‌ను కలెక్టర్ ఉదయ్‌కుమార్ క్యాంపు కార్యాలయంలో శనివారం ఆవిష్కరించారు. మహిళా హక్కుల పోరాటానికి ఏర్పడిన ఐద్వా సంఘం ఎన్నో కార్యక్రమాలను చేపట్టిందని కలెక్టర్‌కు ఐద్వా జిల్లా కార్యదర్శి గీత వివరించారు. మహిళలు పోరాటంలో, పనిలో.. ఏ రూపంలోనైనా తమ శక్తిని ప్రదర్శిస్తూ ప్రపంచానికి స్ఫూర్తినిస్తున్నారని గుర్తు చేశారు. నూతన ఏడాదిలో అయినా మహిళలపై ఆకృత్యాలు, హత్యలు, లైంగికదాడులు చోటుచేసుకోకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పకడ్బందీగా చట్టాలు అమలు చేయాలని కోరారు. కార్యక్రమంలో ఐద్వా జిల్లా కమిటీ సభ్యురాలు శోభ, లక్ష్మి, ప్రియ తదితరులు పాల్గొన్నారు.