నాగర్‌కర్నూల్, మే 14 (నమస్తే తెలంగాణ) : నాగర్‌కర్నూల్ పార్లమెంట్ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. 2018 ఎన్నికల్లో 62.33 శాతం పోలింగ్ జరగగా.. ఈసారి 7 శాతం అదనంగా ఓట్లు పోలయ్యాయి. పార్లమెంట్ పరిధిలో నాగర్‌కర్నూల్, అచ్చంపేట, కల్వకుర్తి, కొల్లాపూర్, గద్వాల, అలంపూర్, వనపర్తి అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ సెగ్మెంట్లలో మొత్తం 17,38,254 మంది ఓటర్లు ఉండగా.. 69.46 శాతంతో 12,07,469 మంది ఓట్లు పోలయ్యాయి. ఎండలు అధికంగా ఉండడంతో సోమవారం సాయంత్రం ఆరు గంట ల వరకు పోలింగ్ జరిగింది. దీంతో పూర్తిస్థాయి పోలింగ్ శాతాన్ని అధికారులు మంగళవారం విడుదల చేశారు. దీని ప్రకారం గత పార్లమెంట్ ఎన్నికలకు మించి 7.13 శాతం పోలింగ్ పెరగడం గమనార్హం. 2018 పార్లమెంట్ ఎన్నికల్లో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో 15,88,111 ఓటర్లు ఉండగా.. 62.33 శాతంతో 9,89,893 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. కాగా, ఈ సారి జరిగిన పోలింగ్‌ను అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా పరిశీలిస్తే.. గద్వాలలో అత్యధికంగా 74.93 శాతం నమోదైంది. 2,56,637 మందికి గానూ 1,92,300 మంది ఓ టు హక్కు వినియోగించుకున్నారు. అచ్చంపేట, కొ ల్లాపూర్ నియోజకవర్గాల్లో అత్యల్పంగా 65.11 శా తం పోలింగ్ జరిగింది. ఇక పోస్టల్ బ్యాలెట్ కూడా 85.95 శాతం నమోదైంది.
14,491 మందికి గా నూ 12,455 మంది ఉద్యోగులు ఓట్లు వేశారు. పోలింగ్ శాతాన్ని పెంచేందుకు వయోవృద్ధులు, ది వ్యాంగులకు హోం ఓటింగ్‌తోపాటు కొత్త ఓటర్లకు ఎన్నికల సంఘం అవగాహన కల్పించింది. ఇదిలా ఉండగా, గతానికి భిన్నంగా ఈసారి త్రిముఖ పోరు నెలకొన్నది. బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు పోటాపోటీగా ప్రచారం చేశారు. ఊరూరా చేసిన ప్ర చారానికితోడు ప్రజలు సైతం తమకు నచ్చిన అభ్యర్థిని గెలిపించేందుకు పోలింగ్ కేంద్రాలకు భారీ ఎ త్తున చేరుకున్నారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీ య ఘటనలు జరగకుండా పోలీసులు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. అయితే, పెరిగిన పోలింగ్ శాతంపై అభ్యర్థులు, రాజకీయ పార్టీ నేతలు, ప్ర జలు గెలుపోటములపై అంచనాలు వేసుకొంటున్నా రు. ఏయే ప్రాంతాల్లో ఎవరికి పోలింగ్ అనుకూలంగా వచ్చిందోనని ఆరా తీస్తున్నారు. కాగా, జూన్ 4న కౌంటింగ్ ఉండడంతో అప్పటి వరకు అభ్యర్థు లు, నాయకులు ఎదురు చూడాల్సిందే.