మానవపాడు, నవంబర్ 9 : తెలంగాణలో బీజేపీ ఎత్తులు పారలేదని, ము నుగోడు గెలుపు కమలం పార్టీకి చెంపపె ట్టు అని ఢిల్లీ అధికార ప్రతినిధి మందా జగన్నాథం అన్నారు. బుధవారం మం డలంలోని అమరవాయి గ్రామంలోని ఎంపీటీసీ రోషన్న గృహంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నియోజకవర్గంతోపాటు రాష్ట్రం మొత్తం టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు కలిసికట్టుగా ఉండాలని కోరారు. మునుగోడు ఉప ఎ న్నికల్లో బీజేపీ ఎన్ని కుయుక్తులు, ధన, అధికార బలంతో గెలవాలని యత్నించి నా అక్కడి ప్రజలు మాత్రం టీఆర్ఎస్నే ఆదరించారని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమంతో నే సాధ్యమైందన్నారు. గతంలో 8 రాష్ర్టా ల్లో ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి ప్రభుత్వాలను కూలగొట్టి బీజేపీ అధికారం చే పట్టిందని, ఇలాగే తెలంగాణలో చేయాలని యత్నించి బొక్కబోర్లా పడిందన్నా రు. ఎన్నికలు అవసరంలేని చోట ఎలక్ష న్లు సృష్టించి ప్రజలపై పెనుబారం మోపుతున్నదని ధ్వజమెత్తారు.
ధాన్యం కొనుగోలులో కేంద్రం వివక్ష చూపి ఆంక్షలు విధించిందని, అయినా సీఎం కేసీఆర్ ప్రతి గింజనూ కొనుగోలు చేశారన్నారు. ఇటీవల దేశంలోని రైతు సంఘాల నేత లు హైదరాబాద్‌లో సమావేశమయ్యార ని, తెలంగాణలో ప్రవేశపెట్టిన రైతు పథకాలు అక్కడి రాష్ర్టాల్లోనూ అమలు చే యాలని ఒత్తిడి తెచ్చేందుకు సిద్ధంగా ఉ న్నట్లు ప్రకటించారన్నారు. ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో ట్యాక్స్ కలెక్షన్ అవుతుందని చెప్పారు. ప్రజల పక్షాన నిలిచి న బీఆర్ఎస్ను ఏ శక్తి అడ్డుకోలేదన్నా రు. పార్టీ ఆవిర్భవించిన మొదటి నుంచి జెండా మోశానని గుర్తు చేశారు. అధిక నిధులు తీసుకొచ్చి నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేసుకోవాలన్నారు. సమావేశంలో శ్రీనివాసులు, మందా శ్రీనాథ్, మురళీధర్‌రెడ్డి పాల్గొన్నారు.