రేపే పుర పోరు
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల ప్ర చారం సోమవారంతో ముగిసింది. చివరి రోజు అన్ని రాజకీయ పార్టీలు ఇంటింటి ప్రచారాలు,రోడ్ షోలతో ఓటర్లను ఆకట్టుకున్నారు. వారం రోజులుగా నిర్వహిస్తున్న మున్సిపల్ ఎన్నికలు ప్రచారం అసెంబ్లీ ఎన్నికలను తలపించాయి.
- పోలింగ్‌కు సర్వం సన్నద్ధం
- ఏర్పాట్లు చేసిన అధికారులు
- అన్ని చోట్ల భారీ బందోబస్తు
- ముగిసిన ప్రచార పర్వం
- ప్రలోభాలపై నేతల దృష్టి
- వేడెక్కిన బల్దియా రాజకీయం
- చివరి రోజు రోడ్‌షోల హోరు
- జనసంద్రంగా పట్టణాలు
మహబూబ్‌నగర్, ఫిబ్రవరి 9 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల ప్ర చారం సోమవారంతో ముగిసింది. చివరి రోజు అన్ని రాజకీయ పార్టీలు ఇంటింటి ప్రచారాలు,రోడ్ షోలతో ఓటర్లను ఆకట్టుకున్నారు. వారం రోజులుగా నిర్వహిస్తున్న మున్సిపల్ ఎన్నికలు ప్రచారం అసెంబ్లీ ఎన్నికలను తలపించాయి. ఆరోపణలు, ప్రత్యారోపణలతో రాజకీయ పార్టీలు ఒకరిపై ఒకరు బాణాలు సంధించుకున్నారు. సవాళ్లు, విమర్శనాస్ర్తాలతో మున్సిపల్ ఎన్నికల వేడిని రగిలించారు. ఉమ్మడి జిల్లాలోని కార్పొరేషన్‌తో పాటు 18 మున్సిపాలిటీలో ఎక్కడికక్కడే అన్ని పార్టీల అభ్యర్థులు ప్రచారంతో ఓటర్ల ను ఆకట్టుకున్నారు. ప్రచారం ముగియడం తో ఇక ప్రలోభాలపై దృష్టి సారించారు.
మ రోవైపు పోలీసులు మున్సిపల్ ఎన్నికలు జరి గే ప్రాంతాల్లో ఎలాంటి ఘటనలు జరగకుం డా బందోబస్తు ఏర్పాట్లు చేపట్టారు. సర్వం సిద్ధం ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని కార్పొరేషన్‌తో పాటు 18 మున్సిపాలిటీలకు పోలి ంగ్ నిర్వహించేందుకు ఎన్నికల సంఘం సర్వం సిద్ధం చేసింది. ఆయా జిల్లా కలెక్టర్లు దగ్గరుండి ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇప్పటికే పోలింగ్ సిబ్బందికి శిక్షణ.. పోలింగ్ సిబ్బం ది కేటాయింపు జరిగిపోయింది. మున్సిపాలిటీలో ఓటర్లు స్వేచ్ఛగా ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రాలను కూడా సిద్ధం చేశారు. అంతేకాకుండా ఓటరు స్లిప్పులను కూడా పంపిణీ చేశారు.
కేంద్రాల వద్ద ఓటర్లకు సహాయం చేసేందుకు ప్రత్యేక సిబ్బందిని ఏర్పాటు చేస్తున్నారు. పోలింగ్‌కు మరో 24 గంటలు సమయం ఉండడంతో పట్టణాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీస్ యంత్రాంగం తగిన బందోబస్తు ఏర్పాటు చేసింది. జోగుళాంబ గద్వాల జోన్ డీఐజీ చౌహన్ ఆధ్వర్యంలో ఆయా జిల్లా ఎస్పీలు దగ్గరుండి బందోబస్తు పర్యవేక్షిస్తున్నారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద భద్రతను కట్టుదిట్టం చేస్తున్నారు. ఈ మేరకు మున్సిపాలిటీలు ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో ఇప్పటికే అవసరమైన పోలీసు సిబ్బందిని కేటాయించారు. ఎన్నికలు ప్రశాంతంగా స్వేచ్ఛాయుత వాతావరణంలో జరిగేందుకు అందరూ సహకరించాలని ఆయా జిల్లాల కలెక్టర్లు కోరుతున్నారు.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jantar Mantar | జంతర్ మంతర్ ఇకపై నిరసన వేదిక కాదు.. నిరసనల కోసం మూడు కొత్త ప్రాంతాలు
Pakistan | పాక్‌లో ముదురుతున్న రాజకీయ సంక్షోభం.. ఖైబర్ పఖ్తున్ఖ్వా గవర్నర్ ఇంటికి నిప్పు..!
AA 23 | అల్లు అర్జున్- లోకేష్ కనగరాజ్ సినిమా అప్డేట్.. ఆలస్యం కానుందనే వార్తలకు చెక్ పెట్టిన దర్శకుడు!
Sand Dumps | రైల్వే పనుల ముసుగులో ఇసుక డంపులు..అక్రమ నిల్వలపై అనుమానాలు
Harish Rao | రైతు వేదికల దగ్గరకు రండి అని రైతులతో ఆటలాడుతున్నారు.. అధికారులపై హరీశ్ రావు ఫైర్
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

