భూత్పూర్, అక్టోబర్ 19 : రైతులను ముంచేలా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తుందని మున్సిపల్ చైర్మన్ సత్తూర్ బస్వరాజ్‌గౌడ్ అన్నారు. వ్యవసాయ మంత్రి తు మ్మల నాగేశ్వరరావు ఈ పంటకు రైతుభరోసా ఇవ్వమని తేల్చిచెప్పడంతో శనివారం భూత్పూర్లో రైతులతో భారీ ర్యాలీ నిర్వహించి, రాస్తారోకో చేపట్టారు. ఈ సందర్భంగా బస్వరాజ్‌గౌడ్ మాట్లాడుతూ కాంగ్రెస్ అంటేనే కరువుకు నిదర్శనమని, ఏనా డూ రైతులను పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి పదేండ్లలో వ్యవసాయరంగాన్ని పండుగలా మార్చగా, కాంగ్రెస్ వచ్చిందే తడవుగా రైతుల కండ్లల్లో కన్నీళ్లు తెప్పిస్తున్నారన్నారు.
ఆరు గ్యారెంటీలంటూ ప్రజలను బురిడీ కొట్టించి అధికారంలోకి వచ్చి పరిపాలన చేతగాక మూసీనది అంటూ కొత్తరాగం ఎత్తుకున్నారన్నారు. 90 శాతం పను లు పూర్తయిన ప్రాజెక్టులను వదిలేసి మూసీ ప్రక్షాళన అంటూ కాంట్రాక్టర్లకు దోచిపెట్టేందుకు సిద్ధమయ్యారని ఆరోపించారు. రైతులను విస్మరిస్తే పుట్టగతులు లేకుండా పోతారని హెచ్చరించారు. అనంతరం సీఎం దిష్టిబొమ్మ దహనం చేసేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. శాంతియుతంగా రాస్తారోకో చేస్తున్న బీఆర్ఎస్ నాయకులను పోలీస్‌స్టేషన్‌కు తరిలించారు. కార్యక్రమంలో సింగిల్‌విండో చైర్మన్ అశోక్‌రెడ్డి, ఫ్లోర్‌లీడర్ శ్రీనివాస్‌రెడ్డి, మాజీ ఎంపీపీ చంద్రశేఖర్‌గౌడ్, మాజీ సర్పంచులు నారాయణ, సత్యనారాయణ, వెంకటయ్య, ఆంజనేయులు, నాయకులు యాదిరెడ్డి, రామునాయక్, రాములు, సురేశ్‌గౌడ్, నర్సింహారెడ్డి, శంకర్‌నాయక్, ప్రేమ్‌కుమార్, షాకీర్, తిరుపతయ్య, రాకేశ్ తదితరులు పాల్గొన్నారు.