Palamuru | మహబూబ్‌నగర్ ఉమ్మడి జిల్లా నుంచి ఇతర పట్టణాలకు వలసలు నిలిచిపోయాయి. గతంలో పొట్టచేతబట్టుకొని.. కుటుంబ సభ్యులు, బంధువులకు దూరంగా బతుకు జీవుడా అంటూ ముంబయి, పూణె వంటి పెద్ద పెద్ద నగరాలకు బస్సుల్లో కిక్కిరిసి వలస వెళ్లేవారు. కానీ తెలంగాణ ఏర్పడ్డాక పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ప్రభుత్వం సాగునీటి రంగానికి ప్రాధాన్యం ఇవ్వడంతోపాటు నిరంతర విద్యుత్ సరఫరా, తండాలు, చిన్న గ్రామాలు పంచాయతీలుగా మారడం.. కులవృత్తులకు చేయూతనివ్వడంతో గ్రామాల స్వరూపం పూర్తిగా మారిపోయింది. సొంతూళ్లలో ఉపాధి పెరగడంతో మెల్లమెల్లగా వలసలు ఆగిపోయాయి. ఉన్న ఊళ్లోనే సంబురంగా పంటలు పండిస్తూ కుటుంబంతో కలిసి సంతోషంగా జీవిస్తున్నారు. వివిధ పనులు చేసుకుంటూ ఆర్థికంగా బలపడ్డారు. ఇదంతా సీఎం కేసీఆర్ విజన్ వల్లే సాధ్యమైందని మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అంటున్నారు.
మహబూబ్‌నగర్, ఏప్రిల్ 19 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : పొట్టకూటి కోసం తట్టాబుట్ట సర్దుకుని ముంబయి వంటి మ హానగరాలకు ఎక్కాల్సిన ఆర్టీసీ బస్సులకు విరామం లభించిం ది. ఏటా 14 లక్షల మందిని వలసలకు తరలించే బస్సులు.. ఇప్పుడు ఎక్కేవాళ్లు లేక ఆగిపోయాయి. పూర్తి స్థాయిలో వలసలు ఆగిపోవడంతో ముంబయికి బస్సులను నిలిపివేయాలని టీఎస్ఆర్టీసీ నిర్ణయించింది. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని ఎనిమిది డిపోల నుంచి ముంబయి బస్సులు నడిపేవా రు. ఒక దశలో ఏ గ్రామం నుంచి ఎక్కువ వెళ్తారో తెలుసుకొని మరీ అక్కడి నుంచి ప్రయాణికులను తరలించేవారు. సీజన్ల వారీగా ఆర్టీసీ అధికారులు కొత్త కొత్త రూట్లను గుర్తించి.. అక్క డి నుంచి ముంబయి బస్సులు నడిపిన ఘనత ఉన్నది. 40 మంది కెపాసిటీ ఉన్న బస్సుల్లో పిల్లలతోకలిసి 80 మంది వర కు ప్రయాణించేవారంటే అప్పటి దుస్థితి అర్థం చేసుకోవచ్చు. బస్సు టాప్‌పై కూడా 670 కిలోమీటర్ల మేర వెళ్లేవారు. చెంతనే జీవనదులు పారుతున్నా సాగు, తాగునీటికి గోసపడ్డారు. అప్పటి పాలకులు ముంబయి బస్సులను ఆపి.. ప్రజలను పరామర్శించేవారే తప్పా వలసలు నిలిపే దిశగా ప్రయత్నం చేయలేదు. స్వరాష్ట్రం లో ఉమ్మడి జిల్లా స్వరూపమే మారిపోయింది. ఈ ఎనిమిదేండ్లల్లో సర్కార్ తీసుకున్న చర్యలతో వలసలు తగ్గుముఖం పట్టా యి. పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయడం, చెరువు ల పునరుద్ధరణ, చెక్‌డ్యాంలు, మినీ లిఫ్ట్‌ల ఏర్పాటుతో బీడు భూములు పచ్చని మాగాణుల్లా మారాయి. ఏటా సాగు వి స్తీర్ణం, దిగుబడి పెరుగుతున్నది. ఒకప్పుడు ఉమ్మడి జిల్లాలో 3 లక్షల ఎకరాలు కూడా సాగుకు నోచుకోని పరిస్థితి ఉంటే.. తా జాగా 19 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగవుతున్నాయి. సంక్షేమ పథకాలతో ప్రజల జీవన ప్రమాణాలు పెరిగాయి.
సమైక్య పాలనలో పాలమూరు అంటే దేశంలో లేబర్ జిల్లా గా పేరు గడించింది. ఇక్కడి ప్రజలు ముంబయి, బెంగళూరు, చెన్నై, కోల్కత్తా, గుజరాత్ వంటి మహానగరాల్లో ఆకాశహర్మాలకు రాళ్లెత్తారు. కష్టపడి పనిచేయడం, కడుపు నిండితే చాలు అనుకునేవారు. దీంతో అప్పటి అధికారిక లెక్కల ప్రకారం ఏ టా 14 లక్షల మంది వలస వెళ్లేవారు. ఉమ్మడి జిల్లాలోని అన్ని డిపోల నుంచి ముంబయికి ప్రత్యేక బస్సులు, ట్రిప్పులు నడిపిన దాఖలాలు ఉన్నాయి. గుంపు మేస్త్రీలు కాంట్రాక్టర్లలతో చేతులు కలిపి ప్రజలకు అడ్వాన్స్ ముట్టజెప్పి బస్సుల్లో కిరాయి పెట్టుకొని తీసుకెళ్లేవారు. ఆరు నెలల కాంట్రాక్ట్ కుదుర్చుకొని అక్కడే కాంట్రాక్టర్ సమకుర్చిన గుడిసెల్లో ఉంటూ పనిచేసేవారు. దీంతో ముంబయిలో భీమండి, దాదర్, కుర్లా ప్రాంతా ల్లో ఏకంగా మన వలస కూలీల కాలనీలే ఏర్పడ్డాయి. ఉమ్మడి జిల్లాలోని కృష్ణ రైల్వేస్టేషన్ నుంచి ప్యాసింజర్ రైళ్లల్లో ముంబాయి పట్టణానికి వెళ్లేవారు.
స్వరాష్ట్రంలో పాలమూరు జిల్లా వలసలపై సీఎం కేసీఆర్ ప్ర త్యేక దృష్టి సారించారు. పెండింగ్ ప్రాజెక్టులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేశారు. మిగిలిన ప్రాంతాలకు సాగునీరందించేందుకు పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలకు శ్రీకారం చుట్టారు. జలవనరులను ఎక్కడికక్కడే ఒడిసి పట్టుకోవడంతో చెరువులు, కుంటలు, చెక్‌డ్యాంల్లో ఎటు చూసినా ఎండాకాలంలో కూడా నీళ్లే దర్శనమిస్తున్నాయి. పల్లెల్లో బోర్లు, చెరువుల కింద సాగు విస్తీర్ణం పెరిగింది. వ్యవసాయ ఉత్పత్తుల దిగుబడి పెరగడం, కూరగాయలు, కమర్షియల్ పంటలు విస్తారంగా పండించడంతో ప్రజల జీవన ప్రమాణాలు పెరిగాయి. ఫలితంగా వలసలు వెళ్లిన వారు తిరిగి గ్రామాలకు చేరుకున్నారు. వ్యవసా యం చేసుకుంటూ.. పథకాలను సద్వినియోగం చేసుకుంటున్నారు. దీంతో ఉమ్మడి జిల్లాకు ఇతర రాష్ర్టాల ప్రజలు వలస వచ్చే స్థితికి చేరుకున్నది.
గతేడాది నుంచి ముంభయికి వెళ్లే కూలీల సంఖ్య పదుల్లో ఉన్నది. గత ఆర్నెళ్లుగా ఈ సంఖ్య పూర్తిగా పడిపోవడంతో ఇటీవల ముంబాయికి బస్సులు నిలిపివేయాలని ఆర్టీసీ అధికారు లు నిర్ణయం తీసుకున్నారు. నారాయణపేట, మక్తల్, మహబూబ్‌నగర్, గద్వాల, వనపర్తి, జడ్చర్ల, నాగర్‌కర్నూల్ నుంచి ముంబాయి బస్సులను పూర్తిగా నిలిపివేశారు. ఈ బస్సులను వేరే రూట్లకు మళ్లించారు. ముంబయికి వాళ్లే వారే లేరని టీఎస్ఆర్టీసీ అధికారి వెల్లడించారు.
సీఎం కేసీఆర్ విజన్ వల్లే వలస లు నిలిచిపోయాయి. మక్తల్ నియోజకవర్గం నుంచే లక్షమంది వరకు ముంబయికి వలస వెళ్లేవారు. గ్రా మాల్లో ఇండ్లకు తాళాలు ఉండేవి. నేడు పరిస్థితులు తలకిందులయ్యా యి. భీమాప్రాజెక్టు, సంగంబండ, భూత్పూర్ రిజర్వాయర్లు కంప్లీట్ కావడం, చెరువులను నింపడంతో సాగు పెరిగింది. బీడు భూములు పచ్చని మాగాణులుగా మారాయి. ఇప్పుడు గ్రామాలు సందడిగా కనిపిస్తున్నాయి.
– చిట్టెం రామ్మోహన్‌రెడ్డి, మక్తల్ ఎమ్మెల్యే