వరికే మొగ్గు
మహబూబ్‌నగర్ జిల్లాలో వానకాలం పంటల సాగు ప్రణాళిక ఖరారైంది. ఈ సీజన్లో జిల్లా వ్యాప్తంగా 4,05,236 ఎకరాలలో వివిధ పంటలు సాగ య్యే అవకాశం ఉన్నట్లు వ్యవసాయ అధికారులు ప్రణాళికా సిద్ధం చేశారు. గతేడాది కంటే ఈ సారి సుమారు 58,406 ఎకరాల్లో సాగు విస్తీర్ణం పెరిగే అవకాశం ఉన్నట్లు అంచనా.. ఇప్పటికే రైతులు పొలాలు దుక్కి దున్ని పంట ల సాగుకు సిద్ధమయ్యారు.
- గతంకంటే 58,406 ఎకరాలు సాగు అధికం
- ఈ సీజన్లో 1.25 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులు అవసరానికి నివేదిక
- వానకాలం ప్రణాళిక ఖరారు
- 2.40 లక్షల ఎకరాల్లో సాగు అంచనా..
- రైతన్నల రెండో ప్రాధాన్యం పత్తికే..
- పాలమూరు జిల్లాలో 4.05 లక్షల ఎకరాల్లో వివిధ పంటల సాగు
పాలమూరు, మే 25 : మహబూబ్‌నగర్ జిల్లాలో వానకాలం పంటల సాగు ప్రణాళిక ఖరారైంది. ఈ సీజన్లో జిల్లా వ్యాప్తంగా 4,05,236 ఎకరాలలో వివిధ పంటలు సాగ య్యే అవకాశం ఉన్నట్లు వ్యవసాయ అధికారులు ప్రణాళికా సిద్ధం చేశారు. గతేడాది కంటే ఈ సారి సుమారు 58,406 ఎకరాల్లో సాగు విస్తీర్ణం పెరిగే అవకాశం ఉన్నట్లు అంచనా.. ఇప్పటికే రైతులు పొలాలు దుక్కి దున్ని పంట ల సాగుకు సిద్ధమయ్యారు. అయితే 2.40 లక్షల ఎకరాల్లో వరి పంట సాగయ్యే అవకాశం ఉన్నది. తర్వాత పత్తి, జొన్న, మొక్కజొన్న, కంది, చిరుధాన్యాల సాగు చేపట్టనున్నారు. పంటల సాగుకు అవసరమైన విత్తనాలు, ఎరువుల వినియోగం, ఇతర అంశాలపై జిల్లా వ్యవసాయ అధికారులు ప్రభుత్వానికి నివేదిక అందించారు.
సన్న రకం వరికి ప్రాధాన్యం
రైతులు సన్న రకం వరి సాగుకు ప్రాధాన్యం ఇవ్వాలని, అలాగే వివిధ రకాల పంటలకు విత్తనాలు సరఫరా చేస్తామని ప్రభుత్వం సూచించింది. మధ్య తరహా సాగునీటి ప్రాజెక్టయిన కోయిల్‌సాగర్ ప్రాజెక్టు ఆయకట్టులో.. అలాగే బోరు, బావులు, చెరువులు, కుంటల కింద పంటలు సాగు చేస్తారని అధికారులు ప్రణాళిక సిద్ధం చేశారు. యాసంగిలో 3,46,830 ఎకరాలలో వరి, ఇతర పంటలు సాగవగా.. వానకాలంలో 4.05 లక్షల ఎకరాల్లో అన్ని పంటలు సాగుకానున్నాయి. ఈ సీజన్లో 1,25,007 మెట్రిక్ ట న్నుల ఎరువులు అవసరం పడనుండగా.. ఇందుకోసం ఇప్పటి నుంచి సెప్టెంబర్ వరకు నెల వారి కోటా మేరకు తెప్పించనున్నారు.
వరి విత్తన రకాలు
వరికి సంబంధించి ఆర్ఎన్ఆర్ -5048, ఆర్ఎన్ఆర్-10754, ఆర్ఎన్ఆర్-28361, ఆర్ ఎన్ఆర్-29325, కేఎన్ఎం-1638, కేఎన్ఎం-118, డబ్ల్యూజీఎన్-44, ఎంటీ యూ-1010, అమల్గోల్డ్ సూపర్ అమన, అంకూర్ సోనా, చిట్టిపొట్టి రకాల విత్తనాలు అందుబాటులో ఉన్నాయి. పత్తికి సంబంధించి యూఎన్-704, సాంకేత్ స్వీప్ట్, రణదీర్, చంద్రగోల్డ్, సదానంద, సీసీహెచ్ 369, నవనీత్, రాణా ఉండగా.. మొక్కజొన్నకు సంబంధించి డీకేసీ-6217, డీసీకే-8171, 4422, ఎన్కే-30, ఎస్-6668, ఎంఎం 9445, సీఏసీ 741, ఎంఆర్ఎం-4065 రకాలను సాగు ఎంచుకోవాలని వ్యవసాయ అధికారులు నిర్ధేశించారు.

పంటల మార్పిడీ పాటిస్తేనే మేలు..
రైతులు ఎప్పుడు ఒకే పంటను సాగు చేయకుండా ప్రతి ఏటా పంట మార్పిడీ అమలు చేస్తే అధిక దిగుబడులు సాధించవచ్చు. రాబోయే వానకాలంలో ఆరుతడి పంటలు సన్న గింజ, వరి రకాలను సాగు చేయాలి. నాణ్యమైన విత్తనాలు, ఎరువులు సరఫరాకు విత్తన షాపుల్లో విస్తృత తనిఖీలు నిర్వహిస్తాం. నకిలీ విత్తన అమ్మకాల నిరోధానికి పోలీసులతో కలిసి టాస్క్‌ఫోర్స్ బృందాలతో సోదాలు నిర్వహిస్తాం. అమ్మకాలలో నాణ్యమైన విత్తనాలు విక్రయించడంతోపాటు బిల్లులు వెంటనే ఇవ్వాలి.
– బీ.వెంకటేశ్, డీఏవో
జిల్లా సాగు అంచనా వివరాలు

Mahabubnagar
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘వినియోగదారుల హక్కులపై చైతన్యం కల్పించాలి’
WPL 2027 | ముంబై ఇండియన్స్ ట్రేడింగ్ డీల్.. మహిళా పేసర్‌కు రూ.10 లక్షలు..!
Pawan Kalyan | పవన్ కళ్యాణ్ సినీ ప్రయాణానికి 30 ఏళ్లు.. ఎమోషనల్ పోస్ట్‌తో శుభాకాంక్షలు తెలిపిన అల్లు అరవింద్!
Binod Chaudhary: నేపాలీ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన ఆ దేశ ఏకైక బిలియనీర్
వరల్డ్ బ్యాంక్ బృందం నల్లగొండ క్లాక్ టవర్ జంక్షన్ అభివృద్ధి పనుల పరిశీలన
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

