మరికల్, మే 9 : ‘గన్నీ బ్యాగులివ్వరూ..’ అనే శీర్షిక శుక్రవారం నమస్తే తెలంగాణ దినపత్రికలో ప్రచురితం కాగా వార్త్తకు జిల్లా అధికారులు స్పందించారు. గురువారం సింగిల్విండో కార్యాలయం ఎదుట నిరసన తెలిపిన రైతులను శుక్రవారం విండో కార్యాలయానికి పిలిపించుకొని వారి సమస్యలను నారాయణపేట జిల్లా వ్యవసాయ శాఖ మానిటరింగ్ అధికారి షాకీర్ పాషా అడిగి తెలుసుకున్నారు.
రైతులకు సరిపడా గన్నీ బ్యాగులను అందిస్తామని, శనివారం లారీలను కూడా రైతులకు అందుబాటులో ఉంచుతామని హామీ ఇచ్చారు. రైతుల సమస్యల గురించి విండో చైర్మన్ రాజేందర్ గౌడ్, సీఈవో కృష్ణయ్యతో మాట్లాడారు. సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు.