బీమాతో ధీమా.. పది రోజుల్లోనే నామినీ ఖాతాల్లోకి డబ్బులు..
- బాధిత కుటుంబానికి భరోసానిస్తున్న ‘రైతుబీమా’ పథకం
- జిల్లాలో 2,894 మందికి రూ.144.70 కోట్ల సొమ్ము జమ
- పారదర్శకంగా అమలుచేస్తున్న యంత్రాంగం
వ్యవసాయమే జీవనాధారంగా ..కుటుంబమే జీవితంగా బతుకుతున్న రైతన్నలకు సర్కార్ పెద్దపీట వేస్తున్నది. పెట్టుబడికి సాయం అందిస్తూ..ఎరువులు, విత్తనాలు సబ్సిడీ ఇస్తూ పంటకు మద్దతు ధర కల్పిస్తూ అండగా నిలుస్తున్నది. ఏదైనా కారణంతో ఇంటి పెద్దను కోల్పోతే ఆ కుటుంబం దిక్కుతోచని స్థితిలో ఉండిపోతుంది. బాధిత కుటుంబాలు పడే బాధను తీరుస్తూ వారికి భరోసానిస్తూ బీమా అందిస్తున్నది సర్కార్. పది రోజుల్లోనే బాధిత ఖాతాల్లో డబ్బులు జమ చేస్తూ పారదర్శకంగా నిలుస్తున్నది.
– మక్తల్ టౌన్, ఆగస్టు 25
రైతుబీమా పథకం అన్నదాత కుటుంబాల్లో కొండంతా భరోసాను నింపేవిధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. దీంతో నారాయణపేట జిల్లాలో 2,894 కుటుంబాల్లో భరోసా నింపింది. ఒక్కో కుటుంబానికి రూ.5లక్షల చొప్పున రూ. 144.70 కోట్ల సొమ్మును ప్రభుత్వం అందించింది. జిల్లాలోని 11మండలాల వ్యవసాయ అధికారుల లెక్కల ప్రకారం లక్షా 75 వేల మంది రైతులు ఉన్నారు. బీమా పథకానికి 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల వయస్సు కలిగిన రైతులను ప్రభుత్వం అర్హులుగా గుర్తించింది. దీంతో లక్షా 15 వేల 763 మందికి బీమా పాలసీ పొందిఉన్నారు.
పథకం అమలు ఇలా..
- 2018 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు బీమాకు లక్షా 15వేల 763 మంది రైతులు అర్హులుండగా వీరిలో 2,894 మంది వివిధ కారణాలతో మృతి చెందారు. బాధిత కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం ఒక్కొక్కరికీ రూ.5లక్షల చొప్పున అందించింది.
- 2018-19 సంవత్సరంలో 640 మంది రైతులు చనిపోగ, వారి కుటుంబాలకు రూ.32కోట్ల బీమా సొమ్మును అందించింది.
- 2019-20 సంవత్సరంలో 620 మంది కుటుంబాలకు రూ. 31 కోట్లు అందించారు.
- 2020-21 సంవత్సరంలో 987 మంది రైతులు చనిపోగా రూ. 48కోట్ల 98 లక్షలు అందించారు.
- 2021-22 సంవత్సరంలో 656 మందికి రూ.32కోట్ల80లక్షలు బీమా సొమ్ము అందగా వివిధ కారణాల వల్ల ఇంక 47 మందికి అందలేదు.
రైతుకు బీమా ఎక్కడాలేదు..
పూర్తి పారదర్శకతతో మొట్టమొదటి సారిగా రైతు బీమా పథకం ద్వారా రైతుల నామినీ ఖతాలోకి రూ. 5 లక్షలు జమకావడం జీవితంలో మొదటి సారిగా చూస్తున్నా. గత ప్రభుత్వ హయాంలో రైతులు మరణిస్తే వారు అర్హులని తేలడానికే సంవత్సరాల కాలం పట్టేది. తెలంగాణ ప్రభుత్వంలో రైతుబీమా పథకంతో 10రోజుల్లోనే బాధిత కుటుంబానికి డబ్బులు అందుతున్నాయి.
– డీఏవో సుధాకర్, నారాయణపేట
పదిరోజుల్లోనే డబ్బులు అందాయి
రైతు బీమా పథకం ద్వారా అందించే రూ. 5లక్షలు పది రోజుల్లోనే నా ఖాతాలో జమ అయ్యింది. నా భర్త శ్రీనివాసులు విద్యుత షాక్‌తో చనిపోయాడు. మాకు సొంత ఇల్లు కూడా లేదు. దిక్కు తోచని స్థితిలో ఉన్న మాకు బీమా డబ్బుతో భరోసా వచ్చింది. ఆ డబ్బులతోనే సొంతిళ్లు కట్టుకున్నాం.
– సునీత, పంచలింగాల, మక్తల్
ఒక్క రూపాయి ఎవరికీ ఇవ్వలే..
సర్కార్ బీమా పథకంతోని ఇచ్చే పైసలు మొత్తం నా ఖాతాలోనే పడ్డాయి. నేను ఎవరికీ ఒక్క రూపాయి కూడా ఇయ్యలే. మా ఇంటాయన పాణం బాగాలేక కాలం చేసిండు. పెద్దదిక్కు కోల్పోయి మాకు సర్కార్ బీమా పైసలు ఇచ్చి ఆదుకున్నది. కొంత బాకీ ఉంటే తీర్చినం. మిగిలిన పైసలు పొలం పనులకు వాడినం.
– వెంకటమ్మ, ఓబ్లాపురం, మాగనూర్
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | తెలంగాణ ఉద్యమకారుడి కుటుంబానికి అండగా కేటీఆర్.. 10 లక్షల ఆర్థిక సాయం అందజేత..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Engilipula Batukamma | సందడిగా.. సంప్రదాయబద్ధంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు..!
ఈఎంసిలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
Bathukamma | జపాన్‌లో బతుకమ్మ సంబురాలు.. టోక్యోలో వెల్లివిరిసిన తెలంగాణ సంస్కృతి
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

