జడ్చర్ల, మే 16 : జడ్చర్ల మండలంలో గురువా రం సాయంత్రం మోస్తరు వర్షం కురిసింది. వ ర్షంలో బాదేపల్లి వ్యవసాయ మార్కెట్లో ఆరుబయట ఉన్న ధాన్యం, మొక్కజొన్న కుప్పలు మా మూలుగా తడిశాయి. అయితే వర్షపు చినుకులు ప్రారంభమవుతున్న సమయంలోనే బాదేపల్లి వ్య వసాయ మార్కెట్ యార్డు ఆవరణలో ఉన్న ధా న్యం, మొక్కజొన్న కుప్పలపై రైతులు కవర్లు కప్పా రు.
దాంతో వర్షం కురిసినా వాటికి అంతగా నష్టం కలుగలేదు. ముసురు వర్షానికి యార్డు పైబాగం నుంచి వర్షపునీరు కిందకు రావడంతో కుప్పల అడుగుభాగం కొద్దిగా తడిసింది. అయితే బుధవారం కొనుగోలు చేసిన ధాన్యం బస్తాలను వ్యాపారులు ఎత్తక పోవడంతో వర్షానికి అవి తడిశాయి. పెద్దవర్షం రాకపోవడంతో రైతులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే గురువారం కురిసిన వర్షానికి వరికోతలకు ఇబ్బందులు కలిగాయి. అదేవిధంగా చేతికొచ్చిన వరి పైర్లు కిందపడే అవకాశం ఉన్నది.

బిజినేపల్లి, మే 16 : బిజినేపల్లితోపాటు మండలంలోని గంగారం, వట్టెం తదితర గ్రామాల్లో గు రువారం సాయంత్రం ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. గాలివానకు మండలంలోని మ హదేవునిపేట నుంచి గంగారం వెళ్లే ప్రధాన రహదారిపై చెట్టు విరిగిపడింది. దీంతో గంగారం, వసురాంతండా, కీమ్యాతండా, పెద్ద తండాలకు వెళ్లే గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఈదురుగాలులకు మండలంలోని పలు గ్రామాల్లో మామిడి కాయలు కూడా నేలరాలాయి.
మూసాపేట, మే 16 : వేసవి ఎండల తీవ్రతకు ఉపశమనం లభించింది. గురువారం సాయంత్రం మూసాపేటలో మోస్తరు వర్షం కురిసింది. 20 నిమిషాలపాటు వర్షం కురియగా.. వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది.అదేవిధంగా అడ్డాకుల, దేవరకద్ర, భూత్పూర్, చిన్నచింతకుంట, కౌకుంట్ల మండలాల్లో కూడా చిరు జల్లులు కురిశాయి.