కల్వకుర్తి, ఏప్రిల్ 18 : రాష్ట్రంలోని పేదల సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ అడుగులు వేస్తున్నారని ఎమ్మె ల్సీ కశిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ ఫలాలు అర్హుల దరికి తీసుకెళ్లే బాధ్యత అందరిపై ఉన్నదని సూచించారు. మంగళవారం కల్వకుర్తి మండలం ఎలికట్ట శివారులోని వ్యవసాయ పొలంలో మాజీ మంత్రి చిత్తరంజన్‌దాస్ ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనానికి ఎమ్మెల్సీ కశిరెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. సీఎం కేసీఆర్ కారణజన్ముడని పేర్కొన్నారు. రా ష్ట్రంలోని ప్రతి ఇంటికి ఏదో ఒక సంక్షేమ పథకాన్ని అం దిస్తున్న ఏకైక ముఖ్యమంత్రి అని, రాష్ట్ర ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నారన్నారు.
తెలంగాణ లో ముచ్చటగా మూడోసారి గులాబీ పార్టీ హ్యాట్రిక్ సా ధించి మరోసారి ముఖ్యమంత్రిగా కేసీఆర్ బా ధ్యతలు చేపట్టడం ఖాయమని ధీమా వ్యక్తం చే శారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ఆశీస్సులతో కల్వకుర్తి నియోజకవర్గ అభివృద్ధికి నిధులు తీసుకొచ్చామని తెలిపారు. ఈ ప్రాంతానికి ఎంజీకేఎల్ఐ సాగునీరు తీసుకొచ్చేందుకు వారు ఎంతగానో కృషి, ప్రోత్సాహం ఎం తో ఉందని గుర్తు చేశారు. అందుకే నేడు కల్వకుర్తికి సా గునీరు, మాడ్గుల మండలం వరకు డీ-82 కాల్వ నిర్మా ణం సాధ్యమైందని చెప్పారు. సాగునీరు తెచ్చేందుకు రెండేండ్ల పాటు కాల్వలు, పొలాల వెంట తిరిగానని, ప్ర తి ప్రొగ్రెస్‌ను సీఎం, మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు దృష్టికి తీసుకెళ్లి అవసరమైన నిధులు తీసుకొచ్చామని వివరించారు.
అభివృద్ధి చేసిన పార్టీలను ప్రజలు ఎల్లప్పుడూ గుర్తుంచుకుంటారని పేర్కొన్నారు. తనకు ఎ లాంటి రాజకీయాలు అవసరం లేదని, ప్రజల అభివృ ద్ధి, వారి సంక్షేమమే తనకు ముఖ్యమన్నారు. సీఎం ఆ లోచనలు, ఆదర్శాలకు అనుగుణంగా పనిచేయడమే త న ధర్మంగా భావిస్తానని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను గ్రామగ్రామానా ప్రజలు వివరించాలని కార్యకర్తలకు ఎమ్మెల్సీ పిలుపునిచ్చారు. అంతకుముందు చిత్తరంజన్‌దాస్ మాట్లాడుతూ దేశంలోనే తెలంగాణ ఆదర్శంగా నిలిచిందంటే అందుకు కారణం సీఎం కేసీఆర్ అన్నారు. పనిచేసే నాయకులను ప్రజలు గుండెల్లో పెట్టి చూసుకుంటారని ఆయన పేర్కొన్నారు. కల్వకుర్తి నియోజకవర్గానికి ఎంజీకేఎల్ఐ సాగునీరు తీసుకొచ్చేందుకు ఎమ్మెల్సీ కశిరెడ్డి ఎంతో కృషి చేశారని తెలిపారు.
రెడ్డిగూడ వద్ద దుందుభీ వాగుపై అక్విడెక్ట్ నిర్మాణ సమయంలో కశిరెడ్డి అక్కడే పడిగాపులు కాశాని గుర్తు చేశారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ సహకారంతోనే నియోజకవర్గంలో అభివృద్ధి సాధించిన ఘనత ఎమ్మెల్సీకే దక్కుతుందన్నారు. ప్రజలకు మంచి చేసే నాయకులకు అండగా నిలిచి వారిని ఆశీర్వదించాలని ఆయన పిలుపునిచ్చారు. అంతకుముందు పలువురు బీఆర్ఎస్ కార్యకర్తలు మాట్లాడారు. కల్వకుర్తికి సాగునీరు తీసుకురావడంలో ఎమ్మెల్సీ కశిరెడ్డి ఎంతో కృషి చేశారని గుర్తు చేశారు. కార్యక్రమంలో ఎంపీపీలు అనిత, కమ్లీ మోత్యానాయక్, మాజీ సర్పంచులు ఆనంద్‌కుమార్, సుదర్శన్‌రెడ్డి, ప్రభాకర్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, విజయ్, సంజీవ్ యాదవ్‌తో పాటు అన్ని మండలాలకు చెందిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.