కల్వకుర్తి/కొల్లాపూర్, ఫిబ్రవరి 27 : తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు, నిజామాబాద్ ఎమ్మెల్సీ కవిత శుక్రవారం నాగర్‌కర్నూల్ జిల్లా పర్యటిస్తున్నట్లు కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి కార్యాలయ సిబ్బంది, నాగర్‌కర్నూల్ జిల్లా జాగృతి అధ్యక్షుడు గణేశ్ వేర్వేరు ప్రకటనల్లో తెలిపారు. శుక్రవారం ఉదయం 6 గంటలకు ఎమ్మెల్సీ కవిత హైదరాబాద్ నుంచి బయలుదేరి ఉదయం 9 గంటలకు కొల్లాపూర్ మండలం సింగోటంలో లక్ష్మీనరసింహస్వామి దర్శించుకొని ప్రత్యేక పూజలు చేయనున్నారు.
అనంతరం ఉదయం 10 గంటలకు నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలోని పద్మనాయక వెలమ భవన్లో నిర్వహించే బీసీ కుల సంఘాల రౌండ్ టేబుల్ సమావేశానికి ఆమె ముఖ్యఅతిథిగా హాజరుకానున్నట్లు పేర్కొన్నారు. ఎమ్మెల్సీ కవిత పర్యటనను విజయవంతం చేయాలని బీఆర్ఎస్ నాయకులు, తెలంగాణ జాగృతి కార్యకర్తలకు వారు పిలుపునిచ్చారు.