కొల్లాపూర్ రూరల్, ఫిబ్రవరి 28 : మండలంలోని సింగోటం లక్ష్మీనర్సింహ స్వామిని ఎమ్మెల్సీ కవిత దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఎమ్మెల్సీ నవీన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే బీరం, రాష్ట్ర నాయకులు రంగినేని అభిలాష్‌రావు, ధూరెడ్డి రఘువర్ధన్‌రెడ్డితో వచ్చిన కవితకు ఆలయం వద్ద అర్చకులు వేద మంత్రాలు, బాజా భజంత్రీలతో ఆహ్వానం పలికారు. అంతకుముందు ఆమెకు ఎన్మన్‌బెట్ల చౌరస్తా వద్ద మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి ఘన స్వాగతం పలికారు.
అక్కడి నుంచి బీఆర్ఎస్ నేత సురేందర్‌రావు ఆధ్వర్యంలో శ్రేణులు డీజే పాటలతో పెద్ద ఎత్తున ర్యాలీగా ఆలయం వరకు చేరుకున్నారు. ఈ సందర్భంగా జై కేసీఆర్.. పూలు చల్లుతూ అడుగడుగునా ఘన స్వాగతం పలికారు. పటాకులు కాల్చి ఆమెకు శాలువా కప్పి సన్మానించారు. పార్టీశ్రేణులు, ప్రజలు పెద్ద ఎత్తున తరలిరాగా ఆలయ ప్రాంగణం కార్యకర్తలతో సందడిగా మారింది. కవిత వద్ద ఫొటోలు దిగడానికి కార్యకర్తలు పోటీపడ్డారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.