పాలమూరు : మహబూబ్నగర్ రూరల్ మండలం కొటకదిర గ్రామంలోని శ్రీశ్రీశ్రీ సద్గురు చంద్రమౌళీశ్వర పురుషోత్తమానంద సరస్వతి స్వామి వారి అనుగ్రహం అందరిపైనా ఉండాలని మహబూబ్నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి ఆకాంక్షించారు. చంద్రమౌళీశ్వర పురుషోత్తమానంద సరస్వతి స్వామి వారి 115వ ఆరాధన మహోత్సవాలు కోటకదిరలో వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సద్గురువు చూపిన మార్గంలో పయనిద్దామని సూచించారు. అంతకుముందు 20 లక్షల రూపాయల ముడా నిధులతో నిర్మించనున్న శ్రీ చంద్రమౌళీశ్వర స్వామివారి ఆలయంలో షెడ్ నిర్మాణపు పనులకు శంకుస్థాపన చేశారు.
కార్యక్రమంలో మైనారిటీ ఫైనాన్స్ కార్పోరేషన్ చైర్మన్ ఓబేదుల్లా కొత్వాల్, ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నర్సింహ్మారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ బెక్కెరి అనిత మధుసూదన్ రెడ్డి, డీసీసీ ప్రధాన కార్యదర్శి సిరాజ్ ఖాద్రీ, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఎన్పీ వెంకటేశ్, మారేపల్లి సురేందర్ రెడ్డి, నాయకులు సీజే బెనహర్, సుధాకర్ రెడ్డి, కె రామచంద్రయ్య, మల్లు అనిల్ రెడ్డి, అనిల్ కుమార్ రెడ్డి, శ్రీనివాస్ యాదవ్, గోవింద్ యాదవ్, మహేందర్ గౌడ్, కె సాయిలు, కురుమూర్తి, వెంకటేశ్, కైసర్, మనెమ్మ మైబు, లాలు పోతన్ పల్లి మోహన్ రెడ్డి, వెంకట్ రాములు, శాంతయ్య తదితరులు పాల్గొన్నారు.