భవిష్యత్ బీఆర్ఎస్దే..
భవిష్యత్‌లో బీఆర్ఎస్ పార్టీయే అధికారంలోకి వస్తుందని, అధైర్యపడకుండా అభివృద్ధిలో భాగస్వాములు కావాలని అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు బీఆర్ఎస్ శ్రేణులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. అయిజ మండలంలోని బైనపల్లి సర్పంచ్ ముక్తర్ ఆధ్వర్యంలో గ్రామంలోని కాంగ్రెస్ నాయకులు గురువారం ఎమ్మెల్యే సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు.
- అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు
- కేసీఆర్ సీఎం అయ్యేవరకు నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలి
- గులాబీ పార్టీలో చేరిన బైనపల్లి కాంగ్రెస్ కార్యకర్తలు
- గులాబీ కండువాలు కప్పి ఆహ్వానం పలికిన ఎమ్మెల్యే
అయిజ, మే 14 : భవిష్యత్‌లో బీఆర్ఎస్ పార్టీయే అధికారంలోకి వస్తుందని, అధైర్యపడకుండా అభివృద్ధిలో భాగస్వాములు కావాలని అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు బీఆర్ఎస్ శ్రేణులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. అయిజ మండలంలోని బైనపల్లి సర్పంచ్ ముక్తర్ ఆధ్వర్యంలో గ్రామంలోని కాంగ్రెస్ నాయకులు గురువారం ఎమ్మెల్యే సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. మూడేళ్ల కాంగ్రెస్ పాలనను కళ్లార చూసిన తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ పార్టీ నే కోరుకుంటున్నారన్నారు. అన్ని రంగాల్లో రాష్ట్రం వెనకబాటుకు గురైందన్నారు. సబ్బండ వర్గాలు కాంగ్రెస్ పాలనపై ఆక్రో శం వెల్లగక్కుతున్నారని మండిపడ్డారు. పదేళ్ల బీఆర్ఎస్ హయాంలోని కేసీఆర్ పాలనలో తెలంగాణ నెంబర్ వన్ స్థానంలో ఉండగా, నేడు అట్టడుగుస్థాయికి చేరుకున్నదన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పూర్వవైభవం వస్తుందని ఆయన ఆశాభా వం వ్యక్తం చేశారు. కేసీఆర్ ముచ్చటగా మూడోసారి సీఎం అయ్యేవరకు బీఆర్ఎస్ శ్రేణులు, నాయకులు, కార్యకర్తలు కలిసికట్టుగా కృషి చేయాలన్నారు. అలంపూర్ ని యోజకవర్గంలోని బీఆర్ఎస్ కార్యకర్తలు అహర్నిషలు అండగా నిలుస్తామన్నారు. కార్యకర్తలు పార్టీ ప టిష్టతకు సమన్వయంతో పని చేయాలన్నారు. అయిజ మం డలంలోని వివిధ గ్రామాలకు చెందిన ఇతర పార్టీల కార్యకర్త లు పెద్దఎత్తున బీఆర్ఎస్లో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని ఎమ్మెల్యే తెలిపారు. అంతకుముందు గులా బీ కండువా కప్పి కార్యకర్తలను బీఆర్ఎస్లోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ భీమేశ్, కార్యకర్తలు అల్లం బాషా, నర్సింహులు, చాంద్, భీమన్న, మహదేవ్, రంగన్న, కనికేట్ శేఖర్, మహబూబ్, గిరి, వెంకటేశ్, సోమేశ్ తదితరులు పాల్గొన్నారు.
చాలా రోజులుగా సమస్య ఉన్నది..
కోస్గి 7వ వార్డులో చాలా రోజులుగా నీటి సమస్య ఉన్నది.. బిందె నీటి కోసం గంటసేపు క్యూలో నిలబడాల్సిన పరిస్థితి. ఈ సమయంలో ఇంటి పనులు చేయాలంటే ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ కోసం తవ్వకాలు జరపడంతో పైపులైన్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. వార్డులోని వేరే ప్రాంతంలో నల్లాల ద్వారా నీళ్లు వస్తున్నా.. మాకు దొరకని పరిస్థితి. మాకే సరిపోవడం లేదు.. మీకెలా ఇవ్వాలంటూ మొఖంపై చెబుతున్నారు.
– పద్మ, గృహిణి, కోస్గి పట్టణం
ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదు..
ఇంటి, వంట పని కోసం నీళ్లు కావాలంటే కష్టంగా ఉంది. మిషన్ భగీరథ నీళ్లు రావడం లేదు. వృద్ధాప్యంలోనూ మేము దూరం వెళ్లి గంటల తరబడి క్యూలో నిలబడి తెచ్చుకోవాల్సి వస్తుంది. అధికారులు, ప్రజాప్రతినిధుల వద్ద ఎన్నిసార్లు మొత్తుకున్నా పట్టించుకోవడం లేదు. ఎన్నికలప్పుడు గెలిపిస్తే సమస్యలు లేకుండా చేస్తామని చెప్పి.. ఇప్పుడేమో అసలు మాటే వినడం లేదు. మా కష్టాలు ఎవరికి చెప్పాలో.. ? ఎలా తీరుతాయో? అర్థం కావడం లేదు.
– గోరె, గృహిణి, కోస్గి పట్టణం
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Warangal | వరంగల్ భద్రకాళి ఆలయంలో భక్తుల రద్దీ.. ఏర్పాట్లలో విఫలమైన అధికార యంత్రాంగం
George Krish | జూనియర్ సైంటిస్ట్‌గా శర్వానంద్.. రామోజీ ఫిల్మ్‌సిటీలో ‘జార్జ్ క్రిష్’ ఊరమాస్ షూటింగ్!
CJP | నిరసన గళాలకు కోర్టులో ఊరట.. విడుదలైన అభిజిత్ దీప్కే బృందం.. వీడియో..!
Dorothy | కార్తీక్ సుబ్బరాజ్ ‘డోరతి’ సినిమాపై రజినీకాంత్ ప్రశంసల జల్లు.. ‘నాకు కావలసిన కార్తీక్ ఇతనే’ అంటూ అభినందనలు!
CJP | ఢిల్లీ నిరసనలు.. మేజిస్ట్రేట్ ముందు సీజేపీ నేతలు హాజరు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

