ఊట్కూర్, ఏప్రిల్ 07 : పేద ప్రజల సంక్షేమమే ధ్యేయంగా తమ ప్రభుత్వం కృషి చేస్తుందని మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి అన్నారు. సోమవారం ఆయన నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండలంలోని అమీన్పూర్, పగిడమర్రి గ్రామాల్లో చౌకధరల దుకాణాల ద్వారా సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల్లో హామీ ఇవ్వక పోయినప్పటికీ పేదవాడికి కడుపునిండా అన్నం పెట్టాలనే ఉద్దేశంతో సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రంలో సన్నబియ్యం పంపిణీకి శ్రీకారం చుట్టారని తెలిపారు.
సన్న బియ్యం పంపిణీ నిరంతరంగా కొనసాగుతుందని, ఆహార భద్రత కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి సన్నబియ్యం అందిస్తామని తెలిపారు. అనంతరం గ్రామంలో నిర్వహించిన ప్రీమియం లీగ్ క్రికెట్ మ్యాచ్ లో పాల్గొని క్రీడాకారులను ఉత్సాహపరిచారు. కార్యక్రమంలో తాసిల్దార్ రవి, మాజీ పిఎసిసిఎస్ చైర్మన్ ఎల్కోటి నారాయణరెడ్డి, మాజీ జెడ్పిటిసి సూర్య ప్రకాష్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు విగ్నేశ్వర్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ శేఖర్ రెడ్డి, గోపాల్ రెడ్డి, లింగం, భీమ కవి, రవీందర్ రెడ్డి పాల్గొన్నారు.