మక్తల్/దేవరకద్ర రూరల్, నవంబర్ 18 : కలియుగ దైవం కురుమూర్తిస్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామివారిని దర్శించుకునేందుకు బు ధవారం మాజీ మంత్రి హరీశ్‌రావు వస్తున్నారని మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి తెలిపారు.
సోమవారం ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ హరీశ్‌రావుతోపాటు మాజీ మంత్రు లు నిరంజన్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, ఎమ్మెల్సీలు నవీన్‌కుమార్, చల్లా వెంకట్రామిరెడ్డి, ఎమ్మెల్యే విజయుడుతోపాటు ఉమ్మడి జిల్లాలోని మాజీ శాసనసభ్యు లు, మాజీ కార్పొరేషన్ చైర్మన్లు స్వామివారి దర్శించుకోనున్నట్లు తెలిపారు.