నారాయణపేట, నవంబర్ 28 : నియోజకవర్గానికి కృష్ణాజలాలను తీసుకొచ్చి రైతుల పాదాలు కడిగుతానని ఎమ్యెల్యే రాజేందర్‌రెడ్డి అన్నారు. ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డితో కలిసి ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం జిల్లా కేంద్రంలో రోడ్‌షో నిర్వహించారు. రోడ్ షోకు ప్రజలు భారీగా తరలివచ్చారు. బీఆర్ఎస్కు మద్దతుగా నినాదాలతో హోరెత్తించారు. పదేండ్లలో చేసిన అభివృద్ధిని చూసి ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని ఎమ్మెల్యే కోరారు.