కోస్గి, జూలై 17 : రేవంత్‌రెడ్డి, చంద్రబాబునాయుడుకు తొత్తు అని, తెలంగాణలో చంద్రబాబు కనుసైగల్లోనే కాంగ్రెస్ నడుస్తోందనికొడంగ ల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి విమర్శించారు. గ్రామాల్లో ఎక్కడికక్కడ కాంగ్రెస్ నాయకులను తరిమికొట్టాలని, సాగుకు 24 గంటల విద్యుత్తు అందించే బీఆర్ఎస్ కావాలా? మూడు గంటలి చ్చే కాంగ్రెస్ కావాలో.. రైతులు ఆలోచించుకోవాలని ఆయన సూచించారు. మంత్రి కేటీఆర్ పిలుపుమేరకు గుండుమల్, దుద్యాల మండ లం హకీంపేట గ్రామాల్లో టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మలను సోమవారం దహనం చేశా రు. అనంతరం రైతువేదికల వద్ద నిర్వహించిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. మల్లీ కాం గ్రెస్ గెలిస్తే చంద్రబాబు చెప్పినట్లు కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుందని, దీంతో ఆంధ్రా నాయకుల పెత్త నం మనపై ఉంటుందన్నారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ నాయకుల వంకర బుద్ధి బయటపడిందన్నారు.
కాంగ్రెస్ గెలిస్తే మూడుగంటల కరెంట్‌తో పంటలు పండక రైతన్న రోడ్డున పడి మళ్లీ ముంబయి వలస పోవాల్సి వస్తదన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో 24 గంటల కరెంట్ రైతుబంధు, మద్దతు ధరతో ధాన్యం కొనుగోళ్లు చేస్తూ రైతులను ఆదుకుంటుంటే కాంగ్రెస్ నాయకులు ఓర్వలేకపోతున్నారని విమర్శించారు. రేవంత్‌రెడ్డి, ఆయన సోదరుడు తిరుపతిరెడ్డి కొడంగల్ నియోజకవర్గంలో ఎక్కడ కనిపించినా తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. అంతకుముందు కోస్గి మున్సిపాలిటీలో రూ.10లక్షలతో 7వ వార్డులో నిర్మిస్తున్న సీసీరోడ్డుకు భూమిపూజ, 6వ వార్డులో రూ.60లక్షలతో నిర్మించిన సీసీరోడ్డును ప్రారంభించారు. కార్యక్రమంలో గ్రంథాలయాల సంస్థ జిల్లా చైర్మన్ రామకృష్ణ, మున్సిపల్ చైర్పర్సన్ శిరీష, పీఏసీసీఎస్ చైర్మన్ భీంరెడ్డి, ఎంపీపీ మధుకర్‌రావు, జెడ్పీటీసీ ప్రకాశ్‌రెడ్డి, మార్కెట్ కమిటీ వైస్‌చైర్మన్ వరప్రసాద్, ప్రజాప్రతినిధులు, నాయకులు, రైతులు పాల్గొన్నారు.