Bhuthpur | భూత్పూర్, మార్చి 30 : దేవరకద్ర నియోజకవర్గం పరిధిలో అన్ని మండల కేంద్రంలో పాటు మేజర్ గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీ కేంద్రాల్లో ప్రజల దాహార్తిని తీర్చేందుకు చలివేంద్రాలను ప్రారంభించాలని ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి పిలుపునిచ్చారు. భూత్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని అమిస్తాపూర్, పట్టణ కేంద్రంలోని చౌరస్తాలో ఆదివారం ఆయన చలివేంద్రాలను ప్రారంభించారు. భూత్పూర్ చౌరస్తా నిత్యం ప్రయాణికులతో రద్దీగా ఉంటుంది. ముఖ్యంగా వేసవికాలం కావడంతో పట్టణ కేంద్రంలో ఆదివారం కూరగాయల సంత జరుగుతుంది.
ఈ సంతకు మండలంలోని వివిధ గ్రామాలతో పాటు పక్క మండలాల నుంచి జనం సంతకు తరలివస్తుంటారు. ఈ క్రమంలో మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ప్రజల సౌకర్యార్థం చలివేంద్రాలను ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ నూరుల్ నజీబ్‌ను ఎమ్మెల్యే శాలువాతో సత్కరించారు. నిత్యం ప్రజలకు ఇబ్బందులు గురవకుండా చలివేంద్రాలను నిర్వహించాలని ఎమ్మెల్యే కోరారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు నవీన్ గౌడ్, మండల అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి, నాయకులు గోవర్ధన్ గౌడ్, మచ్చేందర్, నరేందర్, విజయ్, లక్ష్మి కాంత్ రెడ్డి, బోరింగ్ నర్సింలు తదితరులు పాల్గొన్నారు.