జడ్చర్ల, మే 6 : రైతుల అభివృద్ధే ధ్యేయంగా సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ పథకా లు అమలు చేస్తున్నట్లు జడ్చర్ల ఎమ్మెల్యే డాక్టర్ సి.లక్ష్మారెడ్డి తెలిపారు. శుక్రవారం మండలంలోని మల్లెబోయిన్పల్లి గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ సర్కార్ యా సంగి ధాన్యం కొనుగోలు చేయబోమని చెప్పినా.. సీఎం కేసీఆర్ రైతులు నష్టపోకూడదనే కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు.
ప్రతి గింజనూ కొనుగోలు చేస్తామన్నారు. ధాన్యాన్ని బాగా ఆరబెట్టి, చెత్తాచెదారం లేకుండా శుభ్రం చేసి తీసుకురావాలని సూచించారు. అనంతరం జడ్చర్ల మండలంలో ఇద్దరు దళితబంధు లబ్ధిదారులకు వాహనాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దళితులను ధనికులుగా మార్చేందుకే సీఎం కేసీఆర్ ఈ పథకానికి శ్రీకారం చుట్టారన్నారు. ఎలాంటి బ్యాంకు గ్యారంటీ లేకుండానే ప్రతి లబ్ధిదారుడికి రూ.10 లక్షలు ఉచితంగా అందిస్తున్నట్లు చెప్పారు. పథకాన్ని సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా ఎదగాలన్నారు. కార్యక్రమంలో జెడ్పీ వైస్‌చైర్మన్ యాదయ్య, సర్పంచుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రణీల్‌చందర్, తాసిల్దార్ లక్ష్మీనారాయణ, ఏవో గోపినాథ్, కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.