రాజాపూర్, మే 10 : రైతుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేసిందని ఎమ్మెల్యే డాక్టర్ లక్ష్మారెడ్డి అన్నా రు. బుధవారం మండల కేంద్రంలో ధా న్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రా రంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దళారులను నమ్మి మోసపోవద్దని రైతులకు సూచించారు. ఆరుగాలం కష్టపడి కర్షకులు పండించిన ధాన్యం ప్రతి గింజనూ ప్రభుత్వమే మద్దతు ధర కు కొనుగోలు చేస్తుందన్నారు. దేశంలో ఎక్కడాలేని విధంగా సీఎం కేసీఆర్ రైతు ల సంక్షేమానికి పెద్దపీట వేశారని తెలిపా రు. వారి సంక్షేమం కోసం అహర్నిశలు సీఎం కేసీఆర్ శ్రమిస్తున్నారని చెప్పారు. గతంలో పాలించిన పార్టీలు పట్టించుకోకపోవడంతో ఇక్కడి ప్రజలు బతుకు దె రువు కరువై ఇతర పట్టణాలకు వలస వె ళ్లారని గుర్తు చేశారు.
కానీ తెలంగాణ ఏ ర్పడ్డాక ఇతర రాష్ర్టాల నుంచి ఇక్కడికి వలసలు వస్తున్నారని తెలిపారు. రైతు సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ మిషన్ కాకతీయలో భాగంగా చెరువుల మరమ్మతు, ప్రాజెక్టుల నిర్మాణం, నిరంతర విద్యుత్, రైతుబంధు, రైతుబీమాతో రై తు కుటుంబాలకు ఆర్థిక భరోసా.. విత్తనాలు, ఎరువులు సబ్సిడీపై ఇస్తుండడం తో నేడు వ్యవసాయ పండుగలా మా రిందన్నారు. సాగు విస్తీర్ణం పెరిగి కూలీ లు కరువై ఇతర ప్రాంతాల నుంచి ఇక్కడకు వస్తున్నారని పేర్కొన్నారు. పాలమూరు ప్రాజెక్టులో భాగంగా ఉదండాపూర్ వద్ద నిర్మిస్తున్న రిజర్వాయర్‌ను త్వరగా పూర్తి చేసి జడ్చర్ల నియోజకవర్గంలోని ప్రతి ఎకరాకూ సాగునీళ్లు ఇస్తామన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ సుశీ ల, జెడ్పీటీసీ మోహన్‌నాయక్, వైస్‌ఎంపీపీ మహిపాల్‌రెడ్డి, తాసీల్దార్ రాంబా యి, ఎంపీడీవో లక్ష్మీదేవి, ఏవో నరేంద ర్, రైతుబంధు మండల అధ్యక్షుడు న ర్సింహులు, సర్పంచుల సంఘం మం డలాధ్యక్షుడు బచ్చిరెడ్డి, బీఆర్ఎస్ మం డలాధ్యక్షుడు శ్రీశైలంయాదవ్, ఎంపీటీసీ అభిమన్యురెడ్డి, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు మోహన్‌రెడ్డి, నారాయణరెడ్డి, మల్లేశ్‌గౌడ్, శ్రీశైలం, నాయకులు నరహరి, సత్యయ్య, ఆనంద్‌గౌడ్, శ్రీనివాస్ పాల్గొన్నారు.