మిడ్జిల్, నవంబర్ 25 : మండల కేంద్రంతోపాటు బోయిన్పల్లి, వేముల, మసిగుండ్లపల్లి, కొత్తపల్లి, రాణిపేట, చిల్వేర్, వాడ్యాల్ తదితర గ్రామాల్లో బీఆర్ఎస్ నాయకులు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఎన్నికల మ్యానిఫెస్టోతో ఓటర్ల్లకు వివరిస్తూ పెద్ద సంఖ్యలో కారు గుర్తుకు ఓటు వేయాలని సూచించారు. ఎన్నికల సమయంలో వచ్చి మాయమాటలు చెప్పే కాంగ్రెస్ పార్టీ నాయకులను నమ్మొద్దని సూచించారు. కాంగ్రెస్‌కు ఓటు వేస్తే 3 గంటల కరెంట్, రైతుబంధు, పింఛన్లు బంద్ చేస్తారని కార్యకర్తలు ప్రచారం చేశారు. కేసీఆర్ ప్రభుత్వంలో ఎన్నో సంక్షేమ పథకాలు అన్ని వర్గాల ప్రజలకు అందాయన్నారు. పని చేసే ప్రభుత్వాలకు ప్రజలు అండగా ఉండాలని కోరారు. మరిన్ని సంక్షేమ పథకాలు అందాలంటే కారు గుర్తుకు ఓటు వేయాలన్నారు. కార్యక్రమంలో పీఏసీసీఎస్ చైర్మన్ శ్రీనివాస్‌రెడ్డి, నాయకులు సుధాబాల్రెడ్డి, బాలయ్య, వెంకట్‌రెడ్డి, ఆచారి, శేఖర్, భాస్కర్, శ్రీనివాసులు, మల్లయ్య, కరుణాకర్‌రెడ్డి, భీమయ్య, ప్రదీప్‌రెడ్డి, వెంకటయ్య, రామకృష్ణ ఉన్నారు.
నవాబ్‌పేట, నవంబర్ 25 : బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే డాక్టర్ లక్ష్మారెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుతూ మండలంలోని యన్మన్గండ్ల, నవాబ్‌పేట, దేపల్లి, లోకిరేవు, బట్టోనిపల్లితండా, రుద్రారం, పుట్టోనిపల్లితండా తదితర గ్రామాల్లో శనివారం బీఆర్ఎస్ నాయకులు ఎమ్మెల్యేకు మద్దతుగా ముమ్మరంగా ఇంటింటి ప్రచారం నిర్వహించారు. కారు గుర్తుకు ఓటేసి లక్ష్మారెడ్డిని భారీ మెజా ర్టీతో గెలిపించాల ని కోరారు. కార్యక్రమంలో స ర్పంచులు గోపాల్‌గౌడ్, లత, లలితమ్మ, సత్యం, యూత్వింగ్ మండలాధ్యక్షు డు శ్రీను, నాయకులు లక్ష్మయ్య, హన్మంతు, రఘువీర్, రాములు, ఫక్రుద్దీన్, బాలయ్య, ఆశన్న, మన్యానాయక్, హన్మంతునాయక్, రఘు, ఫాజిల్, రఘుగౌడ్, శ్రీనివాస్‌రెడ్డి, రవీందర్, కోట్ల రాజేశ్, మణికంఠ ఉన్నారు.
బాలానగర్, నవంబర్ 25 : మండల కేంద్రంలోని పెద్దాయపల్లి, నందారం, మోతిఘణపూర్, ఉడిత్యాల గ్రామా ల్లో శనివారం బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి లక్ష్మారెడ్డి తరఫున బీఆర్ఎస్ నాయకులు ఇంటింటికీ తిరుగుతూ కారు గుర్తుకు ఓటు వేసి లక్ష్మారెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో సర్పంచ్ శంకర్, మాజీ ఎంపీటీసీ లక్ష్మయ్య, నాయకులు హరికిషన్, శ్రీధర్‌గౌడ్, ఉమాకాంత్, దశరథ్, శ్రీకాంత్, శ్రీను, యాదిరెడ్డి, శశికాంత్‌రెడ్డి, గోవర్ధన్‌రెడ్డి, లింగం, రాజుగౌడ్, రాజు, నరేందర్ పాల్గొన్నారు.
రాజాపూర్, నవంబర్ 25 : కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే మనకు మళ్లీ పాత రోజులు వస్తాయని ఎంపీపీ సుశీల, జెడ్పీటీసీ మోహన్‌నాయక్ అన్నారు. ఎమ్మెల్యే లక్ష్మారెడ్డికి మద్దతుగా శనివారం మండలంలోని ఆయా గ్రామాల్లో ఇంటింటికీ తిరిగి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. బీఆర్ఎస్ పార్టీ మ్యానిఫెస్టోను ప్రజలకు వివరించి ఈ నెల 30న జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో కారుగుర్తుకు ఓటేసి ఎమ్మెల్యే ల క్ష్మారెడ్డిని గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు శ్రీశైలంయాదవ్, యూత్వింగ్ మండలాధ్యక్షుడు వెంకటేశ్, నర్సింహనాయక్, విజయ్‌రాథోడ్, ముస్త ఫా, మహిపాల్‌రె డ్డి, శేఖర్, వెంకట్రామ్రెడ్డి, వెంకట్‌రెడ్డి, శంకర్‌నాయక్ ఉన్నారు.
హన్వాడ, నవంబర్ 25 : పదేండ్లలో గ్రామంలో చేసిన అభివృద్ధిని చూసి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి, మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ను గెలిపించాలని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అల్లుడు డాక్టర్ శరత్ చంద్రగౌడ్ అ న్నారు. శనివారం మండలంలోని మునిమోక్షం గ్రామంలో కారు గుర్తు కు ఓటు వేసి మంత్రిని గెలిపించాలని ఇంటింటా ప్రచారం చేపట్టారు. కార్యక్రమంలో సర్పంచ్ రాములమ్మ, ఎంపీటీసీ భాగ్యమ్మ, మాజీ సర్పంచ్ చెన్నయ్య, ఎస్టీ సెల్ మండలాధ్యక్షుడు హరిచందర్, నాయకులు రాములు, పాల్గొన్నారు.
మహబూబ్‌నగర్‌టౌన్, నవంబర్ 25 : జిల్లా కేంద్రంలోని ఆయా వార్డులో బీఆర్ఎస్ ఎన్నికల ప్రచారం జోరుగా కొనసాగుతున్నది. శనివారం 48వ వార్డులో మాజీ కౌన్సిలర్ రాశాద్ఖాన్, మాజీ కో ఆప్షన్ సభ్యుడు ప్రభాకర్ ఎన్నికల ప్రచారం చేపట్టారు. మహబూబ్‌నగర్‌ను మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్ని రంగాల్లో అభివృద్ధి చేశారని ఇంటింటికీ తిరిగి వివరించి కారు గుర్తుకు ఓటు వేయాలని కోరారు. ఆయా వార్డుల్లో కౌన్సిలర్లు పటేల్ప్రవీణ్, కట్టారవికిషన్‌రెడ్డి, అనంతారెడ్డి, నీరజ, విఠల్‌రెడ్డి, వనజ, నరేందర్, యాదమ్మ, పుష్పావతి, కిశోర్, రష్మిత, శ్రీనివాసులు, షేక్ఉమర్, మునీర్, నాయకులు ఎన్నికల ప్రచారం చేశారు.