నర్వ, మార్చి 17: క్రీడలు యువత, గ్రామాల మధ్య సోదరభావాన్ని పెంచుతాయని ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. మండలకేంద్రంలో నిర్వహించిన నర్వ ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్లో విజేతలకు శుక్రవారం బహుమతుల ప్రదానం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా హాజరై విజేత జట్టుకు ట్రోఫీని అందజేశారు.
అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ప్రభుత్వం గ్రామాల్లో క్రీడాకారులను ప్రోత్సహించేందుకు అనేక సౌకర్యాలు, అవకాశాలు కల్పిస్తుందని, వాటిని సద్వినియోగపర్చుకుని గ్రామీణ క్రీడాకారులు జాతీయ, అంతర్జాతీయ స్థాయికి ఎదగలన్నారు. కార్యక్రమంలో సింగిల్‌విండో చైర్మన్ బంగ్లా లక్ష్మీకాంత్‌రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు దండు అయ్యప్ప, గడ్డం నర్సింహ, రామన్‌గౌడ్, దండు శంకర్ తదితరులు పాల్గొన్నారు.