గట్టు, జూలై 17 : కల్లబొల్లి మాటల కాంగ్రెస్, మతతత్వ బీజేపీని తరిమి కొట్టడానికి బీఆర్ఎస్ శ్రేణులు సమాయత్తం కావాలన్నారు. వ్యవసాయానికి ఉచితంగా ఇస్తున్న 24 గంటల విద్యుత్తు విధానంపై కాంగ్రెస్ చేస్తున్న కుట్రలకు వ్యతిరేకంగా మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు స్థానిక రైతువేదికలో సోమవారం రైతు సదస్సును నిర్వహించారు. ఎకరం పైరుకు cచాలు అంటూ పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సమావేశంలో మండలంలోని ప్రజాప్రతినిధులు, రైతులు గళం విప్పారు. ‘మూడు పంటలు టీఆర్ఎస్ నినాదం- మూడు గంటల కరెంటు కాంగ్రెస్ విధానం’ అంటూ కాంగ్రెస్ తీరుపై నిప్పులు చెరిగారు. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్, టీడీపీల పాలనలో వ్యవసాయానికి విద్యుత్తు సరఫరా ఏవిధంగా ఉందో అందరం చూశామన్నారు.
పగలు మూడు గంటలు, రాత్రి మూడు గంటలు విడుతల వారీగా కరెంట్ సరఫరా చేసి రైతులను ఎన్నో ఇబ్బందులు పెట్టారని గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 24 గంటల విద్యుత్తు సరఫరాతో రైతుల ఇక్కట్లన్నీ తొలగిపోయాయన్నారు. గతంలో రూ.వెయ్యి అప్పు కోసం రైతు షావుకారు చుట్టూ చెప్పులరిగేలా తిరిగేవాడని.. ఇప్పుడా పరిస్థితి లేదని వివరించారు. ఇదంతా బీఆర్ఎస్ ప్రభుత్వం వల్లనే సాధ్యమైందన్నారు. మూడు గంటల కరెంట్ ఇచ్చే కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మళ్లీ మునుపటి రోజులు రాక మానవని, ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి చైతన్యవంతుల్ని చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం ఎంపీపీ, పీఏసీసీఎస్ చైర్మన్, సర్పంచ్ తదితలు మాట్లాడారు. సమావేశానికి ఎంపీపీ విజయ్‌కుమార్, పీఏసీసీఎస్ చైర్మన్ వెంకటేశ్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రామకృష్ణారెడ్డి, బలిగేర సర్పంచ్ హనుమంతు, కోఆప్షన్ సభ్యుడు వాహబ్, నాయకులు బస్వరాజు, రామాంజనేయులు, తిమ్మప్ప, బజారి, రామునాయుడు, అలీ, హనుమంతురెడ్డి, వెంకటన్నగౌడ్, శ్రీనివాస్‌రెడ్డి, నారాయణ, తిమ్మప్ప తదితరులు పాల్గొన్నారు. రైతులు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున హాజరయ్యారు.