భూత్పూర్, నవంబర్23: అభివృద్ధిని చూసే వివిధ పార్టీల నుంచి బీఆర్ఎస్లోకి వలసలు వస్తున్నారని ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి అన్నారు. గురువారం మున్సిపాలిటీ కేంద్రంలో ఇప్పలపల్లి గ్రామానికి చెందిన దాదాపు 40మంది, తాటిపర్తికి చెందిన 30మంది కాంగ్రెస్ కార్యకర్తలు, వైసీపీ జిల్లా అధ్యక్షుడు మందడి సరోజ్‌రెడ్డి ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి సమక్షంలో చేరారు. వీరికి ఎమ్మెల్యే గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధిని చూసి బీఆర్ఎస్లోకి ఇతర పార్టీల నాయకులు, కార్యకర్తల వలసలు పెరిగాయన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ జిల్లా అభివృద్ధి కోసం పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును మంజూరు చేస్తే కాంగ్రెస్, బీజేపీ నాయకులు కోర్టులో కేసులు వేశారని, మన జిల్లా అభివృద్ధికి మన జిల్లావాసులే అడ్డుకట్ట వేయడం దారుణ మన్నారు. ప్రభు త్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి ఎంతో ఉపయోగ పడుతు న్నాయని తెలిపారు. ముఖ్యంగా రైతు బీమా, రైతుబంధు, కల్యాణలక్ష్మి, మిషన్‌భగీరథ ద్వారా స్వచ్ఛమైన తాగునీరు, 24గంటల విద్యుత్ సరఫరా చేస్తున్నా రన్నారు. ప్రతి కార్యకర్త సైని కుల్లా పని చేసి పార్టీ మరోసారి అధికారంలోకి వచ్చేలా కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ సత్తూర్ బస్వరాజ్‌గౌడ్, ఎంపీపీ కదిరె శేఖర్‌రెడ్డి, రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు, మాజీ మంత్రి పీ.చంద్రశేఖర్, నర్సింహాగౌడ్, ముడా డైరెక్టర్లు చంద్రశే ఖర్‌గౌడ్, సాయిలు, బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
మూసాపేట, నవంబర్ 23 : మీరు వేసే ఓటు మన తల రాతతో పాటు, రాష్ట్ర భవిషత్ను నిర్ణయి స్తుంది. కావున మంచేదో, చేడెదో ఆలోచించి ఓటేయాలని ఎమ్మెలే ఆల వెంక టేశ్వర్‌రెడ్డి కోరారు. గురు వారం మూసాపేట మం డలం నిజాలాపూర్, వేముల, తిమ్మాపూర్, పోల్కంపల్లి తదితర గ్రామాల్లో ఆయన ప్రచారం చేశా రు. ఈ సందరర్భంగా మాట్లాడుతూ ఇన్నాళ్లు సబ్బం డవర్గాల అభ్యున్నతికకే పనిచేశానని, అందుకు నిదర్శనం మీ గ్రామాల్లో చేసిన అభివృద్ధి మీ కళ్లకే కని పిస్తుందన్నారు. సాగునీరు తేవడంతో పాటు విద్యా , వైద్య పరంగా అన్ని రంగాల్లో నియోజకవర్గాన్ని అభి వృద్ధి చేశాన న్నారు. ప్రతిఒక్కరూ కారు గుర్తుకు ఓటేసి మంచి చేస్తున్న సీఎం కేసీఆర్‌కు మరోసారి పట్టం కట్టాలని కోరా రు. అదేవిధంగా ఆయా గ్రామాల్లో నా యకులు కోరిన అభివృద్ధి పనులను గెలిచిన వెంటనే పూర్తి చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. కార్యక్రమంలో బీఆర్ఎస జిల్లా నాయకులు కాటం ప్రదీప్‌కుమార్‌గౌడ్, గట్టు చిన్నతిమ్మప్ప, జెడ్పీటీసీ ఇంద్రయ్యసాగర్, టీఆర్ ఎస్ మండలాధ్యక్షుడు లక్ష్మినర్సింహయాదవ్, ఆయా గ్రామాల ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, మహిళలు , యువకులు, రైతులు పాల్గొన్నారు.