పాలమూరు, జూలై 10 : కాంగ్రెస్, బీజేపీలతోనే దేశం వినాశనమవుతున్నదని ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు. మహబూబ్‌నగర్ జిల్లా కేం ద్రంలోని వీరన్నపేటలో ఉన్న నీలకంఠస్వామి ఆలయం కమ్యూనిటీ హాల్ వద్ద బీజేపీ నాయకుడు కాళ్ల శ్రీనివాసులు, కాంగ్రెస్ నేత నరేశ్‌తోపాటు దాదాపు వంద మంది నేతలు సోమవారం మంత్రి శ్రీనివాస్‌గౌడ్ సమక్షం లో బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా మంత్రి మా ట్లాడుతూ గతంలో దేశాన్ని పాలించిన కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాలు దేశాన్ని అభివృద్ధిలో వెనక్కినెట్టాయన్నారు. మన దేశం కంటే వెశాల్యంలో ఎంతో చిన్నగా ఉన్న దేశా లు సైతం అభివృద్ధిలో దూసుకుపోతున్నాయన్నారు. సింగపూర్, మలేషియా వంటి చిన్న చిన్న దేశాలు కూడా మన దేశం కంటే ముందున్నాయన్నారు. ఒకప్పుడు ఎం తో వెనుకబడిన దక్షిణ కొరియా వంటి దేశాలు సైతం ఎంతో పురోభివృద్ధి సాధించాయన్నారు. ఆ దేశం ప్రపంచంలోని టాప్‌టెన్ దేశాల్లో ఒకటిగా నిలిచిందన్నారు. భారతదేశంలో ఏ రాష్ర్టాలు లేని విధంగా తెలంగాణ ముందంజలో ఉందన్నారు. నూతన జిల్లాలుగా ఏర్పడిన తరువాత మహబూబ్‌నగర్ ఊహించని విధంగా అభివృద్ధి సాధిస్తున్నదన్నారు. దేశ విదేశాల్లో ఉన్న పర్యాటక సొబగులను మహబూబ్‌నగర్‌కు తీసుకొస్తున్నామన్నారు. కులం, మతం పేరిట రాజకీయం చేసే వారిపై అప్రమత్తంగా ఉండాలన్నారు. అంతకుముందు నీలకంఠ స్వామి ఆలయంలో మంత్రి పూజలు చేశారు.
అమ్మవారి ఆశీస్సులు ఉండాలి..
అమ్మవారి ఆశీస్సులతో ప్రజలంతా సుఖ సంతోషాలతో జీవించాలని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ప్రార్థించారు. జిల్లా కేంద్రంలోని 4వ వార్డులో బంగారు మైసమ్మ బో నాల సందర్భంగా ఆలయంలో పూజలు చేశారు. రూ.10 లక్షల వ్యయంతో చేపట్టిన ఆలయ కంపౌండ్‌వాల్ పనులను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భం గా మంత్రి మాట్లాడుతూ ఆలయంలో షెడ్డు నిర్మాణం కోసం రూ.10 లక్షలను విడుదల చేస్తామని హామీ ఇ చ్చారు. ఆయా కార్యక్రమాల్లో బీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు శివరాజ్, కో ఆప్షన్ సభ్యురాలు జ్యోతి, రామలిం గం, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ రాములు, కౌన్సిలర్ యాదమ్మ, మాజీ కౌన్సిలర్ శివశంకర్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ రాములు, కురుమ సంఘం జిల్లా అధ్యక్షుడు నర్సింహులు, 4వ వార్డు అధ్యక్షుడు ఎల్లయ్య, నాయకులు లక్ష్మణ్, సత్యనారాయణ, నవకాంత్, చంద్రకాంత్, భాస్కర్, శేఖర్, శ్రీనివాసులు, కృష్ణ, తిరుపత య్య, గోపాల్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
సాయిచంద్ మరణం తీరనిలోటు
మహబూబ్‌నగర్, జూలై 10 : సాయిచంద్ మరణం తీరనిలోటని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు. జిల్లా కేంద్రంలోని టీఎన్జీవోఎస్ భవనంలో ఉద్యమకారుల సంఘం, కవులు, రచయితలు, కళాకారులు, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో సాయిచంద్ సంస్మరణ సభ నిర్వహించారు. కార్యక్రమానికి మంత్రి హాజరై సాయిచంద్ ఆత్మకు శాంతి చేకూరాలని రెండు నిమిషాలపాటు మౌ నం పాటించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడు తూ సాయిచంద్ భార్యకు కార్పొరేషన్ చైర్పర్సన్ పదవి ఇచ్చి కుటుంబానికి అండగా నిలిచామన్నారు. ప్రతి తెలంగాణ బిడ్డ గుండెలో సాయిచంద్ గాత్రం నిలిచిపోతుందన్నారు. కార్యక్రమంలో కళాకారులు బాలచందర్, జయన్న, శివన్న, సీతారాములు, మహేశ్ పాల్గొన్నారు.
16న బ్రాహ్మణ ఆత్మీయ సమ్మేళనం
మహబూబ్‌నగర్ అర్బన్, జూలై 10 : ఈ నెల 16 వ తేదీన మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో నిర్వహించనున్న బ్రాహ్మణ సంఘం ఆత్మీయ సమ్మేళనానికి హా జరుకావాలని మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ను బ్రాహ్మణులు ఆహ్వానించారు. క్యాంప్ కార్యాలయంలో బ్రాహ్మణు లు మంత్రిని కలిసి ఆహ్వానించడంతోపాటు వేద ఆశీర్వచనాలు పలికారు. కార్యక్రమంలో బ్రాహ్మణ ప్ర ముఖులు గోపాలశర్మ, రాఘవేంద్రశర్మ, శ్రీకాంతశ ర్మ, శ్రీనివాసాచారి, గోపిస్వామి తదితరులున్నారు.