మహబూబ్‌నగర్, మే 6 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) :మహబూబ్‌నగర్ జిల్లాకేంద్రంలోని బహిరంగ సభలో రేవంత్‌రెడ్డిపై మంత్రి శ్రీనివాస్‌గౌడ్ విరుచుకుపడ్డారు. బిడ్డా.. నన్ను, నా తమ్ముడిని అంటావా.. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో గుర్తెరిగి.. నీ చరిత్ర తెలుసుకో అని ఆగ్రహం వ్యక్తం చేశారు. నీ భాగోతం ఎవరికీ తెల్వదు.. సెటిల్మెంట్లు, భూదందాలు చేసే నీవు మమ్మల్ని అం టావా? ఖబడ్దార్ అని హెచ్చరించారు. వాళ్లే సంపన్నులని బిల్డ ప్ ఇస్తున్నాడని.. నీముత్తాత, తాత, నీవు 70 ఏండ్లుగా పార్టీలు మారి, అధికారం అనుభవించి పాలమూరుకు చేసిందేమిటో చెప్పాలని ప్రశ్నించారు. రంగులు మార్చి.. సీఎం కావాలని పగటి కలలు కంటున్నావ్.. మా రెడ్డి, బీసీ, ఎస్సీ, ఎస్టీ సోదరు లను రాజకీయంగా వాడుకొని పైకొచ్చిన నీకు మాకుటుంబం గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. వాడు.. వీడు అని సంబో ధిస్తావా? మేము అనలేమా? నువ్వు ఒక్క దెబ్బ కొడితే 100 దెబ్బలు కొట్టే సత్తా తమకుందన్నారు. ఆంధ్రోళ్ల మోచేతి నీళ్లు తాగి మామల్ని అంటావా? ఖబడ్దార్ అని హెచ్చరించారు. తె లంగాణ వచ్చినంక పాలమూరు జిల్లా అభివృద్ధిలో దూసుకు పోతుంటే కొందరు ఓర్వలేక అవాక్కులు చెవాక్కులు పెలుతున్నారని.. మత ఘర్షణలు రేకెత్తించడానికి ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. రాజకీయం చేయాలన్నా మేమే.. అధికారం చే పట్టాలన్నా మేమే.. అని రెడ్డి సోదరులను రెచ్చగొట్టి వారిని కూ డా మోసం చేసిన ఘనుడన్నారు. కిరాయి వ్యక్తులను తీసుకొచ్చి హంగు, ఆర్భాటం చూపిస్తే బుద్ధి చెబుతామని హెచ్చరించారు.