మహబూబ్నగర్: ఎడతెరపి లేకుండా కురిసిన వానతో మహబూబ్నగర్ పట్టణం నీటమునిగింది. శనివారం రాత్రి నుంచి ఆదివారం ఉదయం వరకు భారీ వర్షం కురిసింది. దీంతో పట్టణంలోని పెద్ద చెరువు కింద లోతట్టు ప్రాంతాలైన రామయ్య బౌలి, శివశక్తి నగర్, బికే రెడ్డి కాలనీ, క్రిస్టియన్ పల్లి, లక్ష్మీ నగర్ కాలనీల్లో ఇండ్లలోకి నీరు చేరింది. విషయం తెలుసుకున్న మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆదివారం తెల్లవారుజామున నీటమునిగిన ప్రాంతాలను పరిశీలించారు. స్థానికులతో మాట్లాడారు. లోతట్టు ప్రాంతాల్లో యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టాలని మున్సిపల్ సిబ్బందిని ఆదేశించారు.