FSL Fire Accident | ఐదు రూములు అగ్నికి ఆహుతి.. పీఎస్‌లో ఫిర్యాదు చేసిన ఎఫ్ఎస్ఎల్ ఇన్స్పెక్టర్
FSL Fire Accident | నాంపల్లిలోని తెలంగాణ ఫోరెన్సిక్ ల్యాబ్‌లో అగ్ని ప్రమాదం జరిగిన నేపథ్యంలో ఆదివారం ఉదయం ల్యాబ్‌ను పోలీసులు సీజ్ చేశారు. ఘటనపై దర్యాప్తు ముమ్మరం చేయ గా, క్లూస్‌టీమ్ మరోసారి తనిఖీలు చేపట్టింది.
FSL Fire Accident | హైదరాబాద్ సిటీబ్యూరో,ఫిబ్రవరి 8(నమస్తే తెలంగాణ): నాంపల్లిలోని తెలంగాణ ఫోరెన్సిక్ ల్యాబ్‌లో అగ్ని ప్రమాదం జరిగిన నేపథ్యంలో ఆదివారం ఉదయం ల్యాబ్‌ను పోలీసులు సీజ్ చేశారు. ఘటనపై దర్యాప్తు ముమ్మరం చేయ గా, క్లూస్‌టీమ్ మరోసారి తనిఖీలు చేపట్టింది. కార్యాలయంలో ఉన్న సీసీ ఫుటేజ్‌లు పరిశీలించినట్టు స మాచారం. ప్రమాదంలో 40 కం ప్యూటర్లు, హార్డ్‌డిస్క్‌లు, ల్యాప్‌టాప్ లు, పెన్‌డ్రైవ్ దగ్ధం అయినట్టు గుర్తించారు. ఈ ఘటన ప్రమాదవశాత్తు జరిగిందా లేదా ఏదైనా కుట్రకోణం ఉన్నదా అనే దిశగా పోలీసులు ఆరా తీస్తున్నారు. వివిధ కేసుల దర్యాప్తులో కీలకపాత్ర పోషించే ఈ ల్యాబ్‌లో దాదాపు అన్ని కీలక ఫైల్స్ తగలబడిపోయినట్టు తెలుస్తున్నది.
ఐదు రూముల్లో సామగ్రి నష్టం
ఎఫ్ఎస్ఎల్లోని మొదటి అంతస్తులో కీలకమైన ఐదు గదుల్లో సా మగ్రి పూర్తిగా కాలిపోయినట్టు ఎఫ్ఎస్ఎల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసరెడ్డి తెలిపారు. ప్రమాద ఘటనపై ఆయన నాంపల్లి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ల్యాబ్‌లో దట్టమైన పొగ అలుముకుని మిగతా రూమ్‌ల కు వ్యాపిస్తున్నదని శనివారం ఉద యం ఎఫ్ఎస్ఎల్లో పనిచేసే 4వ తరగతి ఉద్యోగి సాయికృష్ణ నుంచి తనకు కాల్ వచ్చిందని పేర్కొన్నారు. ఫైర్ డిపార్ట్మెంట్కు సమాచారమివ్వాలని సూచించానని చెప్పారు. ఫైర్ సిబ్బంది చేరుకొని సహాయకచర్యలు చేపట్టడంతో మధ్యాహ్నం ఒకటిన్నరకు మంటలు అదుపులోకి వ చ్చాయని వివరించారు. ఐదు గదు లు పూర్తిగా దెబ్బతిన్నాయని, అందు లో సర్వర్ రూమ్, కంప్యూటర్ ఫోరెన్సిక్ ల్యాబ్, ప్రాపర్టీ రూమ్, కేస్ వెరిఫికేషన్ చాంబర్, అనాలసిస్ చాంబర్లు ఉన్నాయని తెలిపారు. హెచ్ఆర్డీ హాల్, ఫర్నిచర్ అగ్ని ప్ర మాదంలో కాలిపోయాయని పేర్కొన్నారు. జీరో ఎఫ్ఐఆర్ ఫైర్ యాక్సిడెంట్ కింద కేసు నమోదు చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఫోన్ చూడొద్దని తల్లి మందలించిందని మనస్తాపం.. ఇద్దరు పిల్లలను టీవీ ముందు కూర్చోబెట్టి వివాహిత ఆత్మహత్య
RC 17 | సుకుమార్ సినిమా కోసం రామ్ చరణ్ కొత్త లుక్.. బరువు తగ్గడం కోసం ప్రత్యేక శిక్షణ!
ఉప్పల్ భగాయత్‌లో ఘోర ప్రమాదం.. డివైడర్‌ను ఢీకొని ఇద్దరు యువకులు మృతి
KTR | గూండాయిజంతోనే కంపెనీలను భారత్‌కు తీసుకొస్తారా.. రాహుల్ గాంధీని నిలదీసిన కేటీఆర్
HBA1C | 3 నెలల సగటు చక్కెర స్థాయిలను తెలిపే హెచ్‌బీఏ1సీ పరీక్ష నిజమైన ఫలితాలనే ఇస్తుందా..?
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

