మహబూబ్‌నగర్‌టౌన్, సెప్టెంబర్ 28 : పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల నీటి తో జిల్లాలోని అన్ని చెరువులను నింపుతామని ఎక్సైజ్, క్రీడా శాఖల మంత్రి శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు. జిల్లా కేంద్రంలోని అప్పన్నపల్లి, బైపాస్ రోడ్డుపై పిస్తాహౌజ్, పాలకొండ చౌరస్తా, కొత్త కలెక్టరేట్ వద్ద సుందరీకరించిన జంక్షన్లను గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మా ట్లాడుతూ మహబూబ్‌నగర్ పట్టణాన్ని సుందరీకరంగా మారుస్తున్నామన్నారు. గతంలో ఇరుకురోడ్లు, పార్కులు లేక ప్రజలు ఇబ్బందులు పడ్డారని, రాష్ట్రం ఏర్పడిన తరువాత వేగంగా అభివృద్ధి చేశామన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ నర్సింహులు, మార్కెట్ కమిటీ చైర్మన్ అబ్దుల్హ్రెమాన్, కౌన్సిలర్లు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
సామాజిక సేవలో భాగస్వాములు కావాలి..
సామాజిక సేవలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు. మిలాద్ ఉన్ నబీ సందర్భంగా సోషల్ వర్కర్స్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో న్యూటౌన్‌లోని ఫంక్షన్హాల్లో ఏర్పాటు చేసిన రక్తదాన శి బిరాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తలసేమియా వ్యాధితో బాధపడుతున్న రోగులకు రక్తదానం ఎంతో అవసరమన్నారు. రక్తదాతలు రెడ్‌క్రాస్, జనరల్ దవాఖానకు స్వచ్ఛందంగా వచ్చి రక్తదానం చేయాలని పిలుపునిచ్చారు.
సోషల్ వర్కర్స్ వెల్ఫేర్ సొసైటీ ప్రతినిధులను అభినందించారు. అనంతరం రక్తదానం చేసిన యువకులకు సర్టిఫికెట్లు అందజేశారు. మోతీనగర్ మసీద్‌లో రక్తదాన శిబిరంతోపాటు అన్నదానం చేశారు. కార్యక్రమంలో కన్జ్యూమార్ ఫెడరేషన్ చైర్మన్ గట్టు తిమ్మప్ప, గ్రంథాలయాల సంస్థ జిల్లా చైర్మన్ రాజేశ్వర్‌గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ అబ్దుల్హ్రెమాన్, రెడ్‌క్రాస్ చైర్మన్ నటరాజ్, నాయకులు మోసీన్, తయ్యబ్ బశ్వార్, అల్తాఫ్, సున్నీఅబ్దుల్లా, హకీం, వాజీద్, మహబూబ్, ఇబ్ర హీం, మోయిజ్, ఆవేజ్, అజ్మత్, మున్సిపల్ కమిషనర్ ప్రదీప్‌కుమార్, రఫీక్టేల్ పాల్గొన్నారు.
యువతకు ఇక్కడే ఉద్యోగాలు..
మహబూబ్‌నగర్ అర్బన్, సెప్టెంబర్ 28 : హన్వాడ మండలంలో ఫుడ్‌పార్కు పనులు పూర్తయితే యువతకు స్థానికంగా ఉపాధి, ఉద్యోగావకాశాలు లభిస్తాయని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు. జిల్లా కేంద్రంలోని క్యాంప్ కార్యాలయంలో హన్వాడ మండలం టంకర గ్రామానికి చెందిన బీజేవైఎం మండలాధ్యక్షుడు వెంకటేశ్, నాగరాజు, రాజశేఖర్, సత్యం, సాయిలు, విజయ్, సాయి, గోపాల్, నరేశ్, విష్ణుతో సహా 50 మంది నాయకులు, కార్యకర్తలు మంత్రి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. అనంతరం మాచన్‌పల్లి గ్రామానికి చెందిన మొగులయ్యకు సీఎంఆర్ఎఫ్ నుంచి మంజూరైన రూ.2.50 లక్షల ఎల్వోసీని మంత్రి అందజేశారు. కార్యక్రమంలో గ్రంథాలయాల సంస్థ జిల్లా చైర్మన్ రాజేశ్వర్‌గౌడ్, నాయకులు నర్సింహారెడ్డి, శివకుమార్, కృష్ణయ్యగౌడ్, జహంగీర్, శ్రీనివాసులు తదితరులున్నారు.