మహబూబ్‌నగర్ అర్బన్, జూలై 12 : వ్యవసాయనికి 24 గంటల విద్యుత్ అవసరం లేదంటూ రైతులను అవమానించిన టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రె డ్డి వ్యాఖ్యలకు నిరసనగా మహబూబ్‌నగర్‌లోని తె లంగాణ చౌరస్తాలో బీఆర్ఎస్ అధ్వర్యంలో భారీ ధర్నా నిర్వహించారు. కార్యక్రమంలో క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ పాల్గొని రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. రేవంత్‌తోపాటు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా రైతులు, కార్యకర్తలను ఉద్దేశించి మంత్రి మాట్లాడారు. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి దేశాన్ని పాలించిన కాంగ్రెస్ పార్టీ వల్ల రైతులకు ప్రయోజనం చేకూరలేదని, వారి పాలనలో క రెంట్ లేక రైతు అగమైండన్నారు. పగలు మూడు గంటలు, రాత్రి మూడు గంటలు మాత్రమే కరెంట్ ఇచ్చి అన్నదాత ఆగమయ్యేలా చేశారని విమర్శించారు. మళ్లీ మూడుగంటల కరెంటుతో రైతులను ఆ గం చేయాలని రేవంత్ కుట్ర చేస్తున్నాడన్నారు. రైతులకు ఎంతో ప్రయోజనకరంగా ఉన్న ధరణిని బంగాళాఖాతంలో కలుపుతామన్న రేవంత్‌రెడ్డినే రైతులు అందులో కలిపేస్తారని విమర్శించారు. రేవంత్ చేసిన రైతు వ్యతిరేక వ్యాఖ్యలపై ఆ పార్టీ నేతలే విమర్శిస్తున్నారన్నారు. ఏపీ, కర్ణాటకలో మోటర్లకు మీటర్లు పెట్టినా సీఎం కేసీఆర్ మాత్రం ఒప్పుకోలేదని.. తన ప్రాణం ఉన్నంత వరకు రైతులకు ఉచిత విద్యుత్ ఆపే ప్రసక్తే లేదని అసెంబ్లీ సాక్షిగా ప్రస్తావించిన విషయాన్ని మంత్రి గుర్తు చేశారు. దేశంలో 96లక్షల ఎకరాల్లో ధాన్యం పండితే ఒక్క తెలంగాణలోనే 54లక్షల ఎకరాల్లో ధాన్యం పండించి రాష్ట్రం ఆదర్శంగా నిలిచిందన్నారు. ఉచిత కరెంటు, సాగునీరు, పంట పెట్టుబడితో ఇప్పుడిప్పుడే రైతులు బాగుపడుతుంటే రేవంత్ ఓర్వలేకపోతున్నాడని విమర్శించారు. రైతుకు కరెంట్ రాకుండా కుట్రలు చేస్తే రేవంత్‌రెడ్డి అడ్రస్ గల్లంతు చేస్తారని హెచ్చరించారు. వ్యవసాయనికి 24 గంటల ఉచిత కరెంట్ వద్దన్నందుకు రేవంత్‌రెడ్డి చెంపలు వేసుకొని, ముక్కు నేలకు రాసి, రైతులందరికీ క్షమాపణ చెప్పాలని.. లేదంటే వదిలే ప్రసక్తే లేదని మంత్రి హెచ్చరించారు. రైతు వ్యతిరేకి రేవంత్‌కు రైతులే తగిన గుణపాఠం చెబుతారన్నారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు రేవంత్‌రెడ్డి వైఖరిపై తమ కార్యాచరణ కొనసాగుతుందని తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థ చైర్మన్ గెల్లు శ్రీనివాస్‌యాదవ్, రైతుబంధు సమితి జిల్లా చైర్మన్ గోపాల్‌యాదవ్, గ్రంథాలయసంస్థ జిల్లా చైర్మన్ రాజేశ్వర్‌గౌడ్, డీసీసీబీ ఇన్చార్జి చైర్మన్ వెంకటయ్య, ముడా చైర్మన్ వెంకన్న, మున్సిపల్ చైర్మన్ నర్సింహులు, వైస్‌చైర్మన్ గణేశ్, గొర్రెల కాపరుల సహకార సంఘం జిల్లా చెర్మన్ శాంతన్నయాదవ్, మార్కెట్‌కమిటీ చైర్మన్ రెహమాన్, వైస్ చైర్మన్ గిరిధర్‌రెడ్డి, కౌన్సిలర్లు, బీఆర్ఎస్ మండల అధ్యక్షులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.