మహబూబ్‌నగర్ అర్బన్, నవంబర్ 4 : పొరపాటున కాంగ్రెస్ పార్టీకి అధికారం అప్పగిస్తే రాష్ర్టాన్ని అంధకారం చేయడమేకాకుండా తెలంగాణ పరిశ్రలనింటినీ కర్ణాటకకు తరలిస్తారని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత సయ్యద్ ఇబ్రహీం బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని న్యూటౌన్ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మాజీ మంత్రి పి.చంద్రశేఖర్‌తో కలిసి మంత్రి మీడియాతో మాట్లాడారు. హైదరాబాద్‌లో నెలకొల్పనున్న ఐఫోన్ పరిశ్రమ తరలించుకుపోయేందుకు కర్ణాటక ప్రభుత్వం కుట్ర చేస్తున్నదన్నారు. దొంగ సర్వేలతో ప్రజలను అయోమయానికి గురిచేయాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తున్నదని, ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరన్నారు. 60ఏండ్లు అధికారంలో ఉండి పాలమూరును కరువు జిల్లాగా మార్చిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కుతుందన్నారు. ఏండ్లుగా దగాపడ్డ పాలమూరును సీఎం కేసీఆర్ హయాంలో పచ్చబడిందని, మరోసారి బీఆర్ఎస్ను గెలిపిస్తే మరింత అభివృద్ధి చేస్తామన్నారు.
టికెట్లు అమ్ముకుంటున్నరు..
కాంగ్రెస్ పార్టీ నాయకులు బీసీలు, మైనార్టీలకు ఇవ్వాల్సిన టికెట్లను అమ్ముకొని తీవ్ర అన్యాయం చేసినట్లు మైనార్టీ నాయకుడు ఇబ్రహీం విమర్శించారు. పార్టీ కోసం పనిచేసే వారిని కాదని, డబ్బులిచ్చే వారికి టికెట్లు కేటాయించడం దారుణమన్నారు. ఇలాంటి వారికి ప్రజలే తగిన బుద్ధి చెప్పాలన్నారు. మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ను అధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. బీజేపీలో డబ్బులున్న వారికి హౌ ఆర్ యూ అని, లేని వారిని వూ ఆర్ యూ అని అడుగుతారని మాజీ మంత్రి చంద్రశేఖర్ అన్నారు. సర్వేల ఆధారంగా సీట్లు కేటాయిస్తామన్న బీజేపీ తీరా కేటయింపుల్లో వివక్ష ప్రదర్శించిందన్నారు. బీసీలను సీఎం చేస్తామని ప్రగల్బాలు పలికి కనీసం ఎమ్మెల్యే టికెట్ కూడా కేటాయించలేదన్నారు. అనంతరం బీజేపీ సోషల్ మీడియాకు చెందిన యువకులు సుమంత్ ముదిరాజ్, భవానీశంకర్, శరత్‌తోపాటు 50మంది యువకులు మంత్రి శ్రీనివాస్‌గౌడ్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. సమావేశంలో మున్సిపల్ చైర్మన్ నర్సింహులు, గొర్రెల కాపరుల సంఘం జిల్లా అధ్యక్షుడు శాంతన్నయాదవ్, బీఆర్ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సుదీప్‌రెడ్డి, కౌన్సిలర్లు రవికిషన్, కిశోర్, నాయకులు రాములు, రాజేశ్వర్, శివరాజ్, పురుశో త్తం, మల్లేశ్ తదితరులు
పాల్గొన్నారు.