మహబూబ్‌నగర్ టౌన్, ఆగస్టు 24 : టీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని వర్గాల సం క్షేమం, అభివృద్ధి కోసం పని చేస్తుంటే.. కొన్ని మతతత్వ శక్తులు మత ఘర్షణలు సృష్టించాలని యత్నిస్తున్నాయని ఎక్సై జ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అ న్నారు. బుధవారం మహబూబ్‌నగర్ జి ల్లా కేంద్రంలోని హనుమాన్‌పుర మెహరున్నీసా మసీద్ సమీపంలో ఏర్పాటు చే సిన కార్యక్రమానికి మంత్రి హాజరయ్యా రు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకు లు అన్వర్, పాండు, రహీం, బషీర్‌తోపాటు మహిళలు సుమారు 200 మంది టీఆర్ఎస్ పార్టీలో చేరారు. వీరికి గులాబీ పార్టీ కండువాలు కప్పి మంత్రి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం మాట్లాడుతూ మహబూబ్‌నగర్‌లో కొం దరు మత ఘర్షణలు సృష్టించాలని య త్నిస్తున్నారని ఆరోపించారు. ఇక్కడి ప్ర జలు ప్రశాంతంగా ఉండటం వారికి ఇ ష్టంలేదని, అందుకే ఇలాంటి కుట్రలకు ఒడిగడుతున్నారని ధ్వజమెత్తారు. పార్టీలకతీతంగా పాలమూరు పట్టణాన్ని ప్ర శాంతంగా ఉండేలా చూసుకుందామని ఆయన పిలుపునిచ్చారు. ప్రతిపక్ష పార్టీలది పదవులు కూడా అమ్ముకున్న సం స్కృతి కానీ టీఆర్ఎస్లో కష్టపడే వారికే పదవులు వస్తాయన్నారు. పని చేసే ప్ర భుత్వానికి అండగా నిలబడాలని పిలుపునిచ్చారు. గత 70 ఏండ్లు పాలించిన నాయకులు ఏమి చేయలేదని, రాష్ట్రం ఏర్పడిన తర్వాత తాగునీరు, వైద్యంతోపాటు సమస్యలన్నింటినీ తీర్చడంతో టీ ఆర్ఎస్ సర్కార్‌పై ప్రజలకు భరోసా ఏ ర్పడిందన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ నర్సింహులు, వైస్ చైర్మన్ గణేశ్, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్ష, కార్యదర్శులు శివరాజ్, వినోద్, కౌన్సిలర్లు ము నీర్, రవికిషన్‌రెడ్డి, నాయకులు జీవన్, చిన్న, సుభాష్‌గౌడ్ పాల్గొన్నారు.
రాష్ర్టాన్ని వల్లకాడు చేసేందుకు కుట్ర..
చిన్న చిన్న గొడవలను పెద్దగా చేసి రాష్ర్టాన్ని వల్లకా డు చేయాలని కొన్ని దుర్మార్గ శక్తులు కు ట్ర పన్నుతున్నాయని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. మహబూబ్‌నగర్‌లోని కొత్త గంజిలో ఉన్న లక్ష్మీనర్సింహస్వామి కల్యాణ మండపంలో గ్రేన్స్ అండ్ సీడ్స్ మర్చంట్ అసోసియేషన్ కార్యవర్గ ప్ర మాణ స్వీకారానికి మంత్రి హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అధ్యక్షుడిగా ఓంప్రకాశ్, ప్రధాన కార్యదర్శి మే డం ప్రకాశ్‌తోపాటు కార్యవర్గ సభ్యుల తో మంత్రి ప్రమాణం చేయించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ర్టాన్ని, మహబూబ్‌నగర్‌ను మతతత్వ శక్తుల నుంచి కాపాడుకోవాలని సూచించారు. ప్రశాంతంగా ఉన్న రాష్ట్రంలో చిచ్చు రే పాలని కొందరు యత్నిస్తున్నారని ధ్వజమెత్తారు. స్వేచ్ఛగా వ్యాపారాలు జరిగే లా చూస్తామన్నారు. కార్యక్రమంలో ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డి, మార్కెట్ క మిటీ చైర్మన్ రహెమాన్, మాజీ చైర్మన్ రా జేశ్వర్, కౌన్సిలర్ నర్సింహులు ఉన్నారు.