మహబూబ్‌నగర్ అర్బన్, జూలై 27 : సబ్బండ వ ర్గాల అభివృద్ధే సర్కారు లక్ష్యమని ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు. జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మహబూబ్‌నగర్ జి ల్లా కేంద్రంలోని శిల్పారామంలో 300 మంది బీసీబం ధు లబ్ధిదారులకు రూ.లక్ష చెక్కులను గురువారం మం త్రి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ కులవృత్తులను నమ్ముకున్న వారికి ప్రభుత్వం కొం డంత అండగా నిలుస్తున్నదన్నారు. కులవృత్తిదారులను ఆదుకోవాలన్న లక్ష్యంతో ఆర్థికసాయాన్ని అందిస్తున్నామన్నారు. రూ.లక్ష సాయం నిరంతరంగా కొనసాగు తుందన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ అందజేస్తామన్నా రు.
రాష్ట్ర ప్రభుత్వం ఉచిత విద్యుత్ అందిస్తుంటే కేంద్ర ప్రభుత్వం మీటర్లు బిగిస్తాననడం సరైన పద్ధతి కాదన్నారు. మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో మినీట్యాంక్‌బండ్, శిల్పారామం, సస్పెన్షన్ బ్రిడ్జితో కొత్తరూపు సంతరించుకోనున్నదన్నారు. గతేడాది వానకాలంలో రామయ్యబౌళి ప్రాంతం నీట మునిగి ప్రజలు ఇబ్బందులు పడ్డారని, ఈసారి అలాంటి పరిస్థితి లేకుండా చే శామన్నారు. బీసీల సంక్షేమంలో భాగంగా గతంలో రూ.60 లక్షలతో వాషింగ్ మిషన్లను ఏర్పాటు చేశామన్నారు. వడ్రంగులు, నాయీబ్రాహ్మణులు తదితరులకు డబుల్బెడ్రూం ఇండ్లు, కమ్యూనిటీ భవనాలను నిర్మించామన్నారు.
భవిష్యత్‌లో పాలమూరు పట్టణం మున్సిపల్ కార్పొరేషన్‌గా మారుతుందన్నారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలతో జిల్లాను మరింత సస్యశ్యామలం చేస్తామన్నారు. బీసీబంధు కింద జిల్లా వ్యాప్తంగా 15,787 దరఖాస్తులు రాగా, 14 వేల మందిని అర్హులుగా గుర్తించామని తెలిపారు. మహబూబ్‌నగర్ నియోజకవర్గంలో 4,779 అప్లికేషన్లు రాగా, అందులో 4,2 21 మందిని అర్హులుగా గుర్తించి.. ఈ నెల 300 మంది కి మెదటి విడుగా చెక్కులు పంపిణీ చేశామన్నారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్పర్సన్ స్వర్ణాసుధకర్రెడ్డి, కలెక్టర్ రవినాయక్, ఎస్పీ నరసింహ, మున్సిపల్ చైర్మన్ నర్సింహులు, వైస్ చైర్మన్ గణేశ్, ముడా చైర్మన్ వెంకన్న, గ్రం థాలయాల సంస్థ జిల్లా చైర్మన్ రాజేశ్వర్‌గౌడ్, ఎంపీపీ సుధాశ్రీ, హన్వాడ ఎంపీపీ బాలరాజు, బీసీ సంక్షేమ శాఖ జిల్లా అధికారిణి ఇందిర పాల్గొన్నారు.
డ్రోన్‌షో వాయిదా..
పాలమూరు, జూలై 27 : భారీ వర్షాల నేపథ్యంలో మినీట్యాంక్‌బండ్‌పై శుక్రవారం నిర్వహించనున్న డ్రోన్‌షోను వాయిదా వేస్తున్నట్లు మంత్రి శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు. విద్యాసంస్థలకు సెలవులు ఉండడం, వర్షం కారణంగా డ్రోన్‌షోకు ప్రజలు వచ్చే అవకాశం లేనందునా వాయిదా వేశామన్నారు. దశాబ్ధి ఉత్సవాల్లో భాగంగా హైదరాబాద్‌లో ఆస్ట్రేలియాకు చెందిన ఆయుష్ బృం దం నిర్వహించిన డ్రోన్‌షో అత్యద్భుతంగా ఉందన్నారు. ఆయుష్ బృందం సభ్యులను క్యాంప్ కార్యాలయంలో మంత్రి అభినందించారు. ఇలాంటి ప్రదర్శనలు అమెరి కా, సింగపూర్, దక్షిణకొరియా, ఆస్ట్రేలియా వంటి దేశా ల్లో మాత్రమే నిర్వహించారన్నారు. వాతావరణం అనుకూలించక ప్రదర్శన వాయిదా వేశామన్నారు.
అబ్దుల్‌కలాం జీవితం.. దేశ సేవకే అంకితం
ఏపీజే అబ్దుల్‌కలాం జీవితమంతా దేశ సేవకే అంకి తం చేశారని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు. తన చిన్నప్పుడు రామేశ్వరంలో పై నుంచి ఎగురుతున్న విమానాలను చూసి.. ఒక్కసారైనా విమానం ఎక్కాలని కలగనేవారని చివరకు రాకెట్లను తయారీచేశారని పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని మెట్టుగడ్డ వద్ద ఉన్న ఆర్వీఎం హాల్ వద్ద పిల్లలమర్రి సైన్స్ ఫోరం ఆధ్వర్యంలో మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్‌కలాం వర్ధంతిని నిర్వహించారు. క లాం విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కలాం రూపొందించిన స్టంట్స్‌తో ఇప్పుడు నిమ్స్ దవాఖానలో గుండె వైద్యం తక్కువ ధరకే అందుబాటులోకి వచ్చిందన్నారు. అంతకుముందు న్యూటౌన్‌లో అబ్దుల్‌కలాం విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో డీఈవో రవీందర్, పిల్లలమర్రి సైన్స్ ఫోరం అధ్యక్షురాలు పద్మావతి, ఉపాధ్యక్షురాలు రేవతి, కార్యదర్శి మంజులత, పీఆర్టీయూ అధ్యక్షుడు నారాయణగౌడ్, శ్రీధర్, కరుణాకర్‌గౌడ్, జిల్లా సమగ్ర శిక్షణ అధికారులు బాలుయాదవ్, శ్రీనివాస్, పల్లవి, జిల్లా సైన్స్ అధికారి శ్రీనివాస్, గోవర్ధన్‌గౌడ్, నీలిమ, సాయిబాబా, ఆనంద్, అక్తర్, వెంకటస్వామి పాల్గొన్నారు.
ట్యాంక్‌బండ్ పరిశీలన..
మహబూబ్‌నగర్‌టౌన్, జూలై 27 : మినీట్యాంక్‌బండ్‌ను మంత్రి శ్రీనివాస్‌గౌడ్ పరిశీలించారు. పెద్ద చెరువులోకి వర్షపు నీరు రావడంతో కళకళలాడుతున్నదన్నారు.