గద్వాల, జూన్ 11 : సీఎం రాక కోసం గద్వాల ముస్తాబైంది. జిల్లాకేంద్రానికి నేడు సీఎం కేసీఆర్ రానుండడంతో ప్రధాన కూడళ్లు ఫ్లెక్సీలతో నిండిపోయాయి. కలెక్టరేట్, ఎస్పీ, బీఆర్ఎస్ కార్యాలయాలు విద్యుత్ కాంతుల్లో దగదగలాడుతున్నాయి. ఈ సందర్భంగా ఏర్పాట్లను క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్, ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డితో కలిసి పరిశీలించారు. సభా ప్రాంగణం వద్ద వేదికను పరిశీలించి మా ర్కెట్ వెనుక భాగంలో నూతనంగా ఏర్పాటు చేసిన సెంట్రల్ లైటింగ్ ను ప్రారంభించారు. అనంతరం బీఆర్ఎస్ కార్యాలయం, సమీకృత కలెక్టర్ కార్యాలయానికి వెళ్లి కాన్ఫరెన్స్‌హాల్, శిలాఫలకాలు, ప్రజల కోసం ఏర్పాటు చేసిన సౌకర్యాలు, కలెక్టరేట్లో సీఎం పూజా కార్యక్రమాల వివరాలను కలెక్టర్ క్రాంతిని అడిగి తెలుసుకున్నారు. తరువాత ఎస్పీ కార్యాలయాన్ని సందర్శించారు. మంత్రి వెంట మున్సిపల్ చైర్మన్ కేశవ్, ఎస్పీ సృజన, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ సాయిచంద్, రాష్ట్ర వినియోగదారుల ఫోరం చైర్మన్ గట్టు తిమ్మప్ప, మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీధర్‌గౌడ్ తదితరులున్నారు.
సీఎం సభ ఏర్పాట్ల పరిశీలన
పలు అభివృద్ధి పనులను ప్రారంభించేందుకు సీఎం కేసీఆర్ నేడు గ ద్వాలకు రానున్నారు. ఈక్రమంలో సభ ఏర్పాట్లను ఎమ్మెల్యేలు బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, మర్రి జనార్దన్‌రెడ్డి ఆదివారం పరిశీలించారు. అ యిజ రహదారిలో ఏర్పాటుచేసిన బహిరంగ సభా స్థలం, వేదిక, ప్రజలకు ఏర్పాటు చేసిన సౌకర్యాలను పరిశీలించి నిర్వాహకులకు పలు సూచనలు చేశారు. వీరి వెంట ఎంపీపీ రాజారెడ్డి తదితరులున్నారు.