వనపర్తి,నవంబర్ 5 : వడ్డెర, గౌడ కులస్తులు శ్రమజీవులని, రేపటి తరానికి కు లవృత్తులనే కాదు వారి ఉన్నత భవిష్యత్‌కు మంచి అవకాశాలను అందించాల ని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి ని రంజన్‌రెడ్డి పిలుపునిచ్చారు. జిల్లా కేం ద్రంలోని ఆదివారం నిర్వహించిన వడ్డె ర, గౌడ కులస్తుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాల్లో మాజీ ఎంపీ రావుల చంద్రశేఖర్‌రెడ్డి, జెడ్పీ చైర్మన్ లోకనాథ్‌రెడ్డి, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు గట్టుయాద వ్, ఆయా కుల సంఘాల నాయకులతో కలిసి మంత్రి సింగిరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గతంలో వ డ్డెరులు ఎన్నో చారిత్రక కట్టడాల నుంచి భవనాలు నిర్మాణాలు చేపట్టినప్పటికీ వారి జీవితాల్లో వెలుగులు లేవన్నారు. ప్రస్తుత ఆధునిక పరిస్థితులకు అనుగుణంగా వృత్తిని మార్చుకొని ఆర్థికాభివృద్ధి సాధించాలన్నారు. ప్రభుత్వం అర్హులైన ప్రతి మహిళకు సౌభాగ్యలక్ష్మి పథకం కింద నెలకు రూ.3 వేలు అందించనున్నదని తెలిపారు. అలాగే పేదలకు ప్రభుత్వమే ఇండ్ల స్థలాలను కేటాయిం చి, గృహలక్ష్మి పథకం కింద రూ. 3లక్ష లు అందించనున్నదన్నారు. ప్రభుత్వం అన్ని వర్గాల వారి గురుకులాలను ఏర్పా టు చేసి ఉన్నతమైన విద్యను అందిస్తుందన్నారు. రాజకీయంగా ఎదగాలంటే సంఖ్య బలం కాదని, అందరివాడిలా మెలగాలని, అప్పడే రాజకీయంలో ఎ దుగుతామన్నారు. నాడు సాగు, తాగునీరు, విద్యుత్ లేక ఈ ప్రాంత ప్రజలు వలసలు పోయేవారని, ప్రస్తుత పరిస్థితులు ఎలా మారుతున్నాయో మీకు తేలిపేందుకు ప్రతి గ్రామంలో అభివృద్ధి ప్రస్థానం డ్యాకుమెంటరీ ప్రదర్శిస్తున్నామన్నారు. అభివృద్ధి ఆగిపోకుండా ఉం డాలంటే రాష్ట్రంలో మళ్లీ బీఆర్ఎస్ ప్ర భుత్వం రావాలని, దానికి మీమద్దతు ఇవ్వాలని కోరారు.
గత ప్రభుత్వాలు గౌడ కులవ్యవస్థను నిర్వీర్యం చేసిందన్నారు. కానీ తెలంగా ప్రభుత్వం వచ్చాక సీఎం కేసీఆర్ గౌడ వృత్తిపై పూర్తి విశ్లేషించి వారికి అండగా నిలిచి జీవం పోశారన్నారు. హైదరాబా ద్ పట్టణంలో నీరా కేఫ్‌లను తెరిపించి, కల్లు ప్రాముఖ్యతను వెల్లడించారన్నారు. భవిష్యత్తులో ప్రతి మండల కేంద్రంలో నీరా కేఫ్ దుకాణాలు రానున్నాయన్నా రు. హరితహారం కార్యక్ర మం ద్వారా ఈత వనాల ఏర్పాటుకు ప్ర భుత్వం శ్రీ కారం చుట్టిందన్నారు. అలాగే గీత కార్మికులకు బీమా పథకాన్ని కూడా తీసుకొచ్చిందన్నారు. వైన్‌షాపుల కేటాయింపులో కూడా గీతకార్మికులకు 15శాతం రిజర్వేషన్ కల్పించిందన్నారు. జిల్లాకేంద్రంలో సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ విగ్రహం ఏర్పాటు కోసం ము న్సిపా లిటీని ఒప్పించి పాలిటెక్నిక్ భవన ఎదుట కాంస్య విగ్రహం ఏర్పాటు చే యించా మని, అలాగే ఎకరా స్థలం గౌడ సం ఘం భవ నం కోసం కూడా కేటాయించామని వా టిని ఎన్నికల అనంతరం ప్రారంభించుకుందామన్నారు.
మళ్లీ రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వమే వస్తుందని, ఇప్పుడు కొనసాగుతున్న సంక్షేమాలు కొనసాగాలంటే అందరూ బీఆర్ఎస్కు మద్దతుగా నిలవాలని మా జీ ఎంపీ రావుల చంద్రశేఖర్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈ పదేండ్లలో ఎంత అభివృద్ధి జరిగిందో మీ కండ్ల ఎ దుట కనబడుతుంది దానిని కొనసాగించాలంటే పనిచేసే నాయకుడు నిరంజన్‌రెడ్డికి మద్దతుగా నిలిచి గెలిపించాల్సిన బాధ్యత మీ అందరిపై ఉందన్నారు. ప్రజలు గమనించాలి నిజం నిలకడగా వస్తుంటే అబద్ధం ఆరుపాదాల మీద తిరుగుతుందన్న సత్యం మీ అందరికీ తెలుసు అందుకని నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధిని ప్రజలందరికీ వివరించాల్సి బాధ్యత మీపై ఉందన్నారు. కరోనా సమయంలో ప్రపంచవ్యాప్తంగా కరువు పరిస్థితులు వచ్చినా రా ష్ట్రంలో సీఎం కేసీఆర్ దూర దృష్టితో వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి పర్చడంతో ఎక్కడా కరువు పరిస్థితులు రాలేదన్నారు. సీఎం కేసీఆర్ ఆశీస్సుల తో వ్యవసాయ రంగంలో దేశం మొత్తం తెలంగాణ వైపు దృష్టి సారించేలా వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకొచ్చిన ఘనత నిరంజన్‌రెడ్డికే దక్కుతుందన్నారు. అలాగే జెడ్పీ చైర్మన్ లోకనాథ్‌రెడ్డి, వడ్డెర, గౌడ కులపెద్దలు మాట్లాడుతూ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతిని అధికారంగా నిర్వహించడం హర్షించదగినదన్నారు.
రుక్కన్న పల్లి గ్రామం నుంచి 53, కడుకుంట్ల నుంచి 50 మంది, అలాగే వివిధ గ్రామాల నుంచి 100మంది గౌడ కులస్తులు మంత్రి నిరంజన్‌రెడ్డి సమక్షంలో గులాబీ పార్టీలో చేరారు. కార్యక్రమంలో నియోజకవర్గ ఎన్నికల సమన్వయ కర్త వంగూర్ ప్రమోద్‌రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ పలుస రమేశ్‌గౌడ్, శిక్షణ తరగతుల కన్వీనర్ పురుషోత్తంరెడ్డి కౌన్సిలర్ లక్ష్మీదేవమ్మ, గౌడ సంఘం నాయకులు శ్రీనివాస్‌గౌడ్, నిరంజన్‌గౌడ్, సంగమేశ్వర్‌గౌడ్, వడ్డెర సంఘం నాయకులు జాతీయ కార్యదర్శి ఈశ్వర్, రాష్ట్ర నాయకులు కతాల్, జిల్లా అధ్యక్షుడు భూమయ్య, కార్యదర్శి వెంకటయ్య, వర్కింగ్ అధ్యక్షుడు రమేశ్, జిల్లా నాయకులు వెంకటయ్య, గోపాల్, శరవంద, బీచుపల్లి, గోపాల్ తదితరులు పాల్గొన్నారు.