వనపర్తి, నవంబర్ 13 : వనపర్తిని ఇంత అభివృద్ధి చేసిన మంత్రి నిరంజన్‌రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించుకుంటాని బీఆర్ఎస్లో చేరిన పెబ్బేరు మండలం కాంగ్రెస్ నేత కొండారెడ్డి పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని మంత్రి నివాసంలో శనివారం కొండారెడ్డి ఆధ్వర్యంలో 10మంది కాంగ్రెస్ నాయకులు, ఖిల్లా ఘణపురం మండలం ముందరి తండాకు చెందిన రాజనాయక్ ఆధ్వర్యంలో 20మంది కాంగ్రెస్ నాయకులు, పెబ్బేరు మండలం గుమ్మడం కాంగ్రెస్ మండల కిసాన్ సెల్ అధ్యక్షుడు హరికుమార్‌రెడ్డి మంత్రి సమక్షంలో బీఆర్ఎస్లో చేరా రు. ముందుగా వారికి మంత్రి గులా బీ కండువాలు కప్పి ఆహ్వానించారు. అనంతరం పార్టీ లో చేరిన పలువురు నాయకులు మాట్లాడుతూ ఎవరి నాయకత్వంలో కూడా నియోజకవర్గం ఇంత అభివృద్ధి జరగలేదన్నారు. సాగునీరు తెచ్చిన ఘనత నిరంజన్‌రెడ్డికే దక్కుతుందన్నారు. నియోజకవర్గంలో అత్యధికంగా 64మినీ ఎత్తిపోతల పథకాలను తీసుకురావడం మంత్రి వల్లే సాధ్యమైందన్నారు. గత పాలకుల నిర్లక్ష్యం కారణంగా ఏడారి ప్రాంతమైన ఖిల్లాఘణపురం మండలానికి సాగునీరు తీసు కొచ్చి గణపసముద్రానికి నింపి ఆలుగు పారించిన భగీరథుడు నిరంజన్రెడ్డేనన్నారు. మేము 1952 నుంచి రాజకీయాలు చేస్తున్నాం, చూ స్త్తున్నాం.. ఇంత అభివృద్ధి చేసిన నాథుడే లేడన్నారు. తెలంగాణ వస్తే వనపర్తి జిల్లా అవుతుందని, ఇంత అభివృద్ధి జరుగుతుందని ఊహించలేదన్నారు. కార్యక్రమంలో ఆయా గ్రామాల నాయకులు, కార్యకర్తలు తది తరులు పాల్గొన్నారు.
వనపర్తి టౌన్, నవంబర్ 11 : జిల్లాకేంద్రంలోని రాజనగరంలోని రామకృష్ణ ఆలయంలో శనివారం వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి సతీ సమేతంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయంలో గణపతి పూజ, కలశ పూజ, అమ్మవారి చండీహోమం నిర్వహించారు. మంత్రితో పాటు కౌన్సిలర్ నాగ న్న దంపతులు పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో నియోజకవర్గ ఎన్నికల సమన్వయకర్త వంగూరు ప్రమోద్‌రెడ్డి, మున్సిపల్ చైర్మన్ గట్టుయాదవ్, జిల్లా అధికార ప్రతినిధి వాకిటి శ్రీధర్, మార్కెట్ కమిటీ చైర్మన్ రమేశ్‌గౌడ్, కౌన్సిలర్లు బాషానాయక్, పెబ్బేరు మార్కెట్ కమి టీ చైర్మన్ గౌని బుచ్చారెడ్డి, నందిమల్ల అశోక్, మార్క్‌ఫెడ్ రాష్ట్ర డైరెక్టర్ ఉన్నారు.
వనపర్తి టౌన్, నవంబర్ 11 : వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి గెలుపును కాంక్షిస్తూ 23 కిలోమీటర్ల పగురుపందెం నిర్వహించారు. ప్రైవేట్ ఉద్యోగి ప్రకాశ్ శనివారం పెబ్బేరు నుంచి రాజనగరం ఆలయం వరకు రన్నింగ్ చేశాడు. నిరంజన్‌రెడ్డి మళ్లీ గెలవాలి, కేసీఆర్ ప్రభుత్వం హ్యాట్రిక్ కొట్టాలని ఈ రన్నింగ్ చేసినట్లు ప్రకాశ్ తెలిపారు. 2018లో కూడా పెబ్బేరు నుంచి వనపర్తికి రన్నింగ్ చేసినట్లు గుర్తుచేశారు. అనంతరం ప్రకాశ్‌ను మంత్రి స్వాగతించి శాలువాతో ఘనం గా సన్మానించారు. సన్మానించిన వారి లో సింగిరెడ్డి వాసంతి, నియోజకవర్గ సమన్వయకర్త వంగూరు ప్రమోద్‌రెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి వాకిటీ శ్రీధర్, కౌన్సిలర్లు బాషానాయక్, పెబ్బేరు మార్కెట్ కమిటీ చైర్మన్ గౌని బుచ్చారెడ్డి, రఘు తదిత రులు ఉన్నారు.