మూసాపేట, నవంబర్ 16 : అభివృద్ధి సారథి సీఎం కేసీఆర్‌ను ప్రజలకు మరువొద్దని, కొట్లాడి సాధించుకున్న తెలంగాణ రాష్ర్టాన్ని పదేండ్లలోనే ఎంతో అభివృద్ధి చేశారని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. మూసాపేట మండలంలోని మహ్మద్హుస్సేన్పల్లిలో గురువారం రాత్రి మంత్రి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రికి గ్రామస్తులు పూలు చల్లుతూ ఘనస్వాగతం పలికారు. గజమాలతో సన్మానించారు. మంత్రి చేసిన అభివృద్ధికి అకర్షితులై గ్రామానికి చెందిన కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు చెందిన 20మంది నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ బీఆర్ఎస్ పాలనలో పార్టీలకు అతీతంగా అర్హులందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేసినట్లు గుర్తుచేశారు. ఎలాంటి బేదాభిప్రాయం లేకుండా సుస్థిర పాలన అందిస్తున్నారని కొనియాడారు.
గ్రామాల్లో ప్రజలు కూడా అదే నిబద్ధతతో పార్టీలకు అతీతంగా కేసీఆర్‌కు మద్దతుగా కారు గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. తెలంగాణ ఏర్పాటు నాటి నుంచి సీఎం కేసీఆర్ గ్రామ స్వరాజ్యం కోసం నిరంతరం కృషి చేస్తున్నారని చెప్పారు. గత ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చానని, ధైర్యంగా ఓట్లు అడుతున్నామని, కానీ కాంగ్రెస్ పార్టీ సంక్షోభాన్ని సృష్టించి ప్రజల బతుకులను ఆగం చేసి వలస జీవులను చేసిందని చెప్పారు. నేడు సీఎం కేసీఆర్ సహకారంతో ప్రతి పల్లెకు సాగునీరు తీసుకొచ్చి పచ్చని పంటలు పండేలా చేశారని, దగా పడ్డ బతుకులను మార్చిన బీఆర్ఎస్ పార్టీకి మద్దతుగా నిలిచి కారు గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో ఆయా గ్రామాల ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు.