ఉమ్మడి జిల్లాలో గులాబీ జెండా పండుగ అట్టహాసంగా జరిగింది. ఊరూ.. వాడా.. జెండా రెపరెపలతో శ్రేణుల మది ఉప్పొంగింది. పల్లె, పట్నం గులాబీయమంగా మారింది. బీఆర్ఎస్ ఆవిర్భావ వేడుకల్లో భాగంగా మంగళవారం పార్టీ పతాకాలను ఆవిష్కరించారు. వనపర్తిలో వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి, మహబూబ్‌నగర్‌లో క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌తోపాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు, పార్టీ అధ్యక్షులు హాజరై ఎగురవేశారు. అనంతరం ఆయా నియోజకవర్గాల్లో ప్రతినిధుల సభ జరిగింది. నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. కొన్ని ప్రాంతాల్లో శ్రేణులతో కలిసి నాయకులు మోటర్ సైకిళ్ల ర్యాలీ నిర్వహించారు. అమరవీరుల స్తూపం వద్ద మంత్రులు, ఎమ్మెల్యేలు నివాళులర్పించారు. గులాబీ పార్టీ విజయ పరంపరను వివరించారు. నాడు ఉద్యమ పార్టీ నుంచి మొదలైన ప్రస్తానం.. నేడు జాతీయ పార్టీ శక్తిగా ఎదిగిందని అభివర్ణించారు. రాబోయే ఎన్నికల్లో హ్యాట్రిక్ విజయాన్ని సాధించి సీఎం కేసీఆర్‌కు కానుక అందించాలన్నారు. ఇందుకోసం శ్రేణులు కష్టపడి పనిచేయాలని పిలుపునిచ్చారు.
వనపర్తి, ఏప్రిల్ 25 : దేశం తిరోగమనంవైపు వెళ్లా లా.. ఆధునిక ప్రపంచంతో పోటీపడి పురోగమనంవైపు వెళ్లాలా అన్నది మనముందున్న ప్రశ్న అని, 2024 పార్లమెంట్ ఎన్నికలు దేశ భవిష్యత్‌కు పరీక్ష అని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. వనపర్తి జిల్లా కేంద్రంలోని లక్ష్మీప్రసన్న గార్డెన్స్‌లో మంగళవారం నిర్వహించిన బీఆర్ఎస్ నియోజకవర్గస్థాయి ప్రతినిధుల సమావేశానికి మంత్రి హాజరయ్యారు. ముందుగా గులా బీ జెండాను ఎగురవేసి అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పించారు. అనంతరం పలు అంశాలకు సంబంధించిన తీర్మానాలు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బీజేపీపాలిత ప్రాంతాల్లో అభివృద్ధి శూన్యమన్నారు. తొమ్మిదేండ్లలో జరిగిన తెలంగాణ అభివృద్ధి ఇతర రాష్ర్టా ల్లో లేదన్నారు. తెలంగాణలో ముచ్చటగా మూడోసారి అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని అన్నా రు. ఔరంగాబాద్‌లో సీఎం కేసీఆర్ పర్యటన విజయవంతమైందని సంతోషం వ్యక్తం చేశారు. అక్కడ స్థానిక ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీదే విజయమని అన్నారు. రాష్ట్రంలో ఆత్మలేని పార్టీలు ప్రతిపక్షాలుగా ఉన్నాయని దుయ్యబట్టారు. రాష్ర్టానికి వచ్చిన అమిత్‌షా ఆ రిజర్వేషన్ తీసే స్తాం.. ఇది చేస్తాం, అది చేస్తామని ప్రగల్భాలు పలికారని విమర్శించారు. అదే ఔరంగాబాద్ పర్యటనకు వెళ్లిన కేసీఆర్ అక్కడి ఎన్నికల్లో బీఆర్ఎస్ను గెలిపిస్తే ఐదేండ్లలో ఇంటింటికీ తాగునీరు సరఫరా చేస్తామని చెప్పారన్నారు.
సీఎం కేసీఆర్ అభివృద్ధి గురించి మాట్లాడితే.. బీజేపీ నేతలు జైళ్లు, కేసులు, నిర్భందాల గురించి మాట్లాడుతున్నారని విమర్శించారు. తొమ్మిదేండ్లలో చేసిన అభివృద్ధిపై ప్రజల్లో చర్చ పెట్టి ఆశీస్సులను కోరుదామన్నారు. మంత్రి కేటీఆర్ చేతులమీదుగా త్వరలోనే బైపాస్‌రోడ్డుకు శంకుస్థాపన, సమీకృత మార్కెట్, టౌన్‌హాల్, ఎస్పీ కా ర్యాలయాలను ప్రారంభిస్తామని చెప్పారు. అలాగే భారీ బహిరంగ సభ నిర్వహిస్తామన్నారు. ప్రజాక్షేత్రంలో ప్రజల కదలికలే నాయకుల ప్రతిభకు గీటురాయి అని, మూడేండ్లలో కట్టిన కాళేశ్వరం ఎత్తిపోతల పథకం దేశ, విదేశీ ఇంజినీరింగ్ నిపుణుల ప్రశంసలు అందుకుంటున్నదని, విమర్శలకు ప్రజాతీర్పుతోనే సమాధానం చెప్పాలన్నారు. అంతకుముందు కళాకారుల ఆటపాటల ఆకట్టుకున్నాయి. సమావేశంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకురాలు సింగిరెడ్డి వాసంతి, జిల్లా అధ్యక్షుడు గట్టుయాదవ్, గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ లక్ష్మయ్య, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు జగదీశ్వర్‌రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ పలుస రమేశ్‌గౌడ్, మున్సిపల్ చైర్పర్సన్ కరుణశ్రీ, వైస్‌చైర్మన్ వాకిటి శ్రీధర్, పార్టీ శిక్షణాకమిటీ చైర్మన్ పురుషోత్తంరెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్లు గౌని బుచ్చారెడ్డి, లక్ష్మారెడ్డి, ఎత్తం రవి తదితరులు ఉన్నారు.