పెద్దమందడి, మే 5 : పార్టీలో చేరిన వారు పాత, కొత్త తేడా లేకుండా సమన్వయంతో పనిచేయాలని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి తెలిపారు. మండలంలోని ఆయా గ్రామాలకు చెందిన వివిధ పార్టీల నాయకులు శుక్రవారం హైదరాబాద్‌లో మంత్రి నిరంజన్‌రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. పార్టీలో చేరిన వారికి గులాబీ కండువా కప్పారు.
బీఆర్ఎస్ సర్కార్ చేపడుతున్న అభివృద్ధిని చూసి పార్టీలో చేరుతున్నట్లు మంత్రి తెలిపారు. పార్టీలో చేరిన వారిలో చిన్నమందడి, వీరాయపల్లి, చిలకటోనిపల్లి, ఖిల్లాఘణపురం మండలం షాపూర్ గ్రామాల నాయకులు అప్పాజి, శ్రీను, వెంకటేశ్, సురేశ్, మహేశ్ తదితరులు ఉన్నారు.