వనపర్తి టౌన్, మే 26 : కాంగ్రెస్ పాలనలో నీళ్లు, నిధులు, కరెంట్, పింఛన్, ప్రజల సమస్యలన్నీ పెండింగ్‌లోనే ఉన్నాయని, పెండింగ్‌కు పర్యాయపదం కాంగ్రెస్ పార్టీ అని వ్యవసాయశా ఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి విమర్శించారు. జిల్లా కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో శుక్రవారం మంత్రి మా ట్లాడారు. కాంగ్రెస్ హయాంలో పాలమూరులో వలసలు, కాల్వలో కంపచె ట్లు, ఆకలిచావులు తప్పా చేసిన అభివృ ద్ధి ఏమిటని ప్రశ్నించారు. ఉమ్మడి రా ష్ట్రంలో తెలంగాణను ఆగం చేసిన వారు ఏ ముఖం పెట్టుకొని పర్యటనలు చేస్తున్నారన్నారు. సీఎం కేసీఆర్ పాలనలో తాగు, సాగునీరు, విద్యుత్, ప్రతి పల్లె పచ్చని పైర్లతో కళకళలాడుతున్నాయని, చేపట్టిన అభివృద్ధి ప్రజలకు కళ్లకు కట్టిన ట్లు కనబడుతోందని తెలిపారు. నీళ్లున్నా ప్రజలకు అందించకుండా పాలమూరును వలసల జిల్లాగా మార్చిన చరిత్ర మరిచి నేడు మరోసారి ప్రజలను ఆగం చేసేందుకు మోసపూరిత మాటలతో మ భ్యపెట్టాలని చూస్తే నమ్మే పరిస్థితుల్లో లేరని స్పష్టం చేశారు. 2018లో ఉమ్మడి పాలమూరులో 14 నియోజకవర్గాల్లో 13 ఎమ్మెల్యే స్థానాల్లో బీఆర్ఎస్కు ప్ర జలు పట్టం కట్టారని, ప్రజాస్వామ్యంలో ప్రజల నిర్ణయమే ముఖ్యమన్నారు. క ర్ణాటక ఫలితాలు చూసి తెలంగాణలో పగటి కలలు కంటున్నారని, అక్కడ ప్రత్యామ్నాయం లేక ప్రజలు పట్టం కట్టార న్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు.
తాగునీటి సమస్య పరిష్కారం..
పట్టణానికి తాగునీటి సమస్య సత్వర పరిష్కారానికి బైపాస్ ద్వారా వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి నీటిని విడుదల చేశారు. శుక్రవారం మధ్యాహ్నం గుంపుగట్టు వద్దనున్న రామన్‌పాడు నుంచి గోపాల్‌పేటకు వెళ్లే తాగునీటి పైపులైన్ నుంచి బైపాస్ ద్వారా వనపర్తి పట్టణానికి ఆర్ఎంఎల్డీ పైపులైన్‌కు వాల్వ్తిప్పి నీటిని విడుదల చేశారు. రూ.300కోట్ల నిధులతో మిషన్ భగీరథ అడిషనల్ ప్రాజెక్టును సీఎం కేసీఆర్ మంజూరు చేశారని, దాదాపు పూర్తి కావొచ్చిందన్నారు. గోపాల్పేట మండలానికి మిషన్ భగీరథ ప్రా జెక్టు ద్వారా నీటిని అందిస్తున్నామని, గో పాల్‌పేట నుంచి బుగ్గపల్లితండా వరకు పైపులైను పనులు పూర్తికావాల్సి ఉందని తెలిపారు. మరో 15రోజుల్లో పనులు పూర్తయితే వనపర్తి పట్టణంతో పాటు అన్ని గ్రామాలకు తాగునీటి సమస్య శాశ్వతంగా పరిష్కారం కానుందన్నారు.
రూ.3.34కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన..
వనపర్తి రూరల్, మే 26 : రాష్ట్రంలోని గిరిజనుల అభ్యున్నతికి అనేక కా ర్యక్రమాలను ప్రభుత్వం చేపడుతున్నద ని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి ని రంజన్‌రెడ్డి అన్నారు. శుక్రవారం మండలంలోని పలు తండాల్లో రూ.3.34 కోట్లతో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం గిరిజనులకు ఇచ్చిన మాటకు కట్టుబడి తండాల ను గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేసిందని తెలిపారు. చిట్యాల తూర్పు తండా గ్రామ పంచాయతీ భవనం కోసం రూ.20లక్షల నిధులు కేటాయించామన్నారు. అలాగే పడమటి తండా బీటీ రోడ్డు కోసం రూ.43లక్షలు, రాజపే ట గ్రామ పరిధిలో ని పాపిగాని తండాకు బీటీ, సీసీ రోడ్డుకు రూ.54లక్షలు, దత్త్తాయిపల్లి పెద్ద తండా బీటీ రోడ్డుకు రూ.47లక్షలు , అచ్యుతాపురం నుంచి చి ట్యాల బీటీ రోడ్డుకు రూ.కోటి 70లక్షలతో పనులకు శంకుస్థాపనలు చేసినట్లు వెల్లడించారు. చిట్యాలలో నిర్మాణంలో ఉన్న ఆలయాన్ని సందర్శించారు. అచ్యుతాపురంలోని మైసమ్మ ఆలయంలో పూజలు చేశారు. దత్తాయిపల్లి పెద్దతండాలో గిరిజనులతో కలిసి నృత్యం చేశారు. కార్యక్రమంలో సర్పంచులు లక్ష్మణ్ నాయక్, పుల్జీన్ నాయక్, భానుప్రకాశ్ రావు, శారద, జ్యోతి, రూప్లీ తదితరులు పాల్గొన్నారు.