తిమ్మాజిపేట, సెప్టెంబర్ 12 : సతీమణిని కోల్పోయి పుట్టేడు దుః ఖంలో ఉన్న మాజీ మంత్రి లక్ష్మారెడ్డి, ఆ యన కుటుంబ సభ్యులను గురువారం పలువులు ప్రముఖులు ప రామర్శించారు. మాజీ రాజ్యసభ సభ్యుడు సంతోష్‌కుమార్, రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ తిమ్మాపేట మండలం ఆవంచకు చేరుకొని శ్వేతాలక్ష్మారెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
అనంతరం మాజీ మంత్రి లక్ష్మారెడ్డి ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. అదేవిధంగా మాజీ మంత్రులు కొప్పుల ఈశ్వర్, ఇంద్రకరణ్‌రెడ్డి, మాజీ ఎంపీ వినోద్‌కుమార్, మాజీ ఎమ్మెల్యేలు పుట్ట మధు, కోరుకుంటి చందర్, మహేశ్‌రెడ్డి, మాజీ కార్పొరేషన్ చైర్మన్ దేవిప్రసాద్, విజయ డైయిరీ మాజీ చైర్మన్ లోక భూమారెడ్డితోపాటు జడ్చర్ల, నాగర్‌కర్నూల్ నియోజకవర్గాలకు చెందిన బీఆర్ఎస్ నాయకులు కూడా మాజీ మంత్రి లక్ష్మారెడ్డిని కలిసి పరామర్శించారు.